మరో ఆరు నెలల్లో ఏపీ కేబినెట్‌లో మార్పులు జరగనున్న నేపథ్యంలో, ఎవరు జగన్ కేబినెట్‌లో ఉంటారు? ఎవరు కేబినెట్ నుంచి తప్పుకుంటారు? అనే అంశాలు బాగా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నవారు తమ మంత్రి పదవులని కాపాడుకోవాలని గట్టిగానే కష్టపడుతున్నారు. అటు మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం(సిక్కోలు) జిల్లాలో ఎవరు జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకుంటారో అనే అంశంపై ఆసక్తి నెలకొంది.


ప్రస్తుతం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఇందులో ధర్మాన మొదట నుంచి మంత్రిగా ఉంటే, అప్పలరాజు గతేడాది కొత్తగా కేబినెట్‌లోకి వచ్చారు. మండలి రద్దు నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే జగన్, మోపిదేవికి రాజ్యసభ ఇచ్చారు.


అలాగే మోపిదేవి సామాజికవర్గమైన(మత్స్యకార) అప్పలరాజుని మంత్రివర్గంలో తీసుకున్నారు. గత ఎన్నికల్లో అప్పలరాజు పలాస నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా దూకుడుగా ఉన్న అప్పలరాజునే జగన్ కేబినెట్‌లో తీసుకున్నారు. ఇక అప్పలరాజు మంత్రి అయ్యి సంవత్సరం కూడా కాలేదు. పైగా మత్స్యకార వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇంకా ఎవరు లేరు. దీంతో అప్పలరాజు పదవి కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది.


అటు ధర్మాన కృష్ణదాస్ ప్లేస్‌లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రివర్గంలోకి రావొచ్చని ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రసాదరావు కాంగ్రెస్‌లో పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ఇక స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాంని కూడా మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అటు స్పీకర్‌గా కృష్ణదాస్‌కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఏ మార్పు జరిగిన అప్పలరాజుని మాత్రం మంత్రిగా కొనసాగించడం ఖాయమని తెలుస్తోంది. అయితే జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి మార్పులు చేస్తారో? ధర్మాన ప్రసారావుకు ఛాన్స్ ఇస్తారో లేదో? తెలియాలంటే ఆరు నెలలు వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఆరు నెలల్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో సిక్కోలులో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: