ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టి టి డి ) చైర్మన్ పదవిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొద్ది రోజుల్లో ఈ పదవిలో ఉన్న వారు గద్దె దిగాల్సిన సమయం ఆసన్నమైనందున. టీటీడీ చైర్మన్ కుర్చీ ఖాళీ అవుతోంది. అయితే ఈ పదవిని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తిరిగి వారికే కట్టబెట్టబోతున్నారా, లేక ఇంకెవరికైనా ఇవ్వబోతున్నారా అన్న అంశం ఇప్పుడు ఏపీలో హైలెట్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే అప్పట్లో సీఎం జగన్ బాబాయ్ ఒంగోలు ఎంపీ గా ఉన్న వై వి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయగా, వైఎస్ జగన్ మాత్రం ఆయన్ని పక్కన బెట్టి టిడిపిని వీడి  వైసిపిలో కి ఎంట్రీ ఇచ్చిన మాగంటి శ్రీనివాసుల రెడ్డి కి ఎంపి సీటును కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే అందుకు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చిన్నబుచ్చుకోగా ఆయనకి అధికారంలోకి వచ్చిన వెంటనే టి టి డి చైర్మన్ పదవి ఇస్తానని ఆయన్ని కూల్ చేశారు . వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019  లో ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే టీటీడీ చైర్మన్ పదవిని బాబాయ్ సుబ్బారెడ్డి కి ఇచ్చారు.  2019 జూన్ 21 న  వై ఎస్ జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి టి టి డి చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక నాటి నుండి నేటి వరకు టీటీడీ చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన ఇప్పుడు పదవీకాలం ముగుస్తుండంతో కొత్త ఛైర్మన్ ఎవరు అన్న చర్చ మొదలైంది. 2021 జూన్ 21 నాటికి టి టి డి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం ముగియనుంది అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.

ఈ నెల జూన్ 21 వ తేదీతో ఆ పదవికి రెండేళ్లు పూర్తి కాబోతున్నాయి.  కాగా తిరిగి ఆ పదవిని  సీఎం వైఎస్ జగన్ బాబాయ్ సుబ్బారెడ్డికే కట్టబెడతారని ఓ వైపు చర్చ మొదలవగా, లేదు లేదు టిటిడి కి కొత్త ఛైర్మన్ రాబోతున్నారు అని మరోవైపు చర్చ కొనసాగుతోంది. మరి మన సీఎం జగన్ టిటిడి చైర్మన్ కుర్చీని ఎవరికి ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: