ప్రస్తుతం వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన ఇక తన కొత్త పార్టీని ప్రారంభించేందుకు షర్మిల సిద్ధమైపోయారు  ఇప్పటికే పార్టీ స్థాపన కోసం నిర్వహించే సభకు పోలీసుల నుంచి అనుమతి కూడా వచ్చింది.  అయితే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తాను అంటూ చెప్పిన షర్మిల  కేసీఆర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక షర్మిల పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఎలా రాణించ బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 సాధారణంగా  అయితే కొన్ని మీడియా సంస్థలు కొన్నిరకాల విచిత్రమైన సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక కొన్ని పార్టీలు ఎన్నికల్లో అదరగొడతాయని..  తిరుగు ఉండదు అంటూ ఎన్నో సర్వేలో చెబుతూ ఉంటాయి. కానీ తీరా చూశాక కనీసం ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంటుంది  ఇలా రాజకీయాల్లో ఎన్నోరకాల వింత సర్వే లు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి  ఇక ఇటీవల షర్మిల పార్టీ గురించి ఒక మీడియా సంస్థ సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఇటీవలే కొన్ని రోజులపాటు సీక్రెట్ గా నిర్వహించిన సర్వేలో 2024 ఎలక్షన్లలో షర్మిల సీఎం అవ్వబోతున్నారు అన్నది తేలింది అని ఆ మీడియా సంస్థ తెలిపింది.



 తెలంగాణ ప్రజలందరూ షర్మిల ను ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని ఇటీవల ఒక మీడియా నిర్వహించిన సర్వేలో వెల్లడి అయ్యిందట. షర్మిల  తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో అనుకూలత ఉందట.  వైయస్ దూరమైనప్పటికీ ఇప్పటికి కూడా 72 నియోజకవర్గాల ప్రజలలో వైయస్ పై ప్రేమ అభిమానం ఉందని ఇక ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలిపింది మీడియా సంస్థ. వీరందరూ ప్రస్తుతం షర్మిల పార్టీకి అనుకూలంగా ఉన్నారట. దీంతో ఇక మరికొన్ని సీట్లు గెలిస్తే చాలు 2024 ఎన్నికల్లో షర్మిల సీఎం కావడం ఖాయమని ఇటీవలే ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఇది స్వయంగా షర్మిల చేయించుకున్నట్లు ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: