ఏడాది కాలం నుంచి కరోణ వైరస్  మనల్ని  వెంటాడుతోంది. అయితే  కరోనాను మించిన  అత్యంత ప్రమాదకరమైన  సమస్య  ఇంకా మానవాళిని వెంటాడుతోంది. ఆ సమస్య ఏమిటంటే  కోటి విద్యలు కూటి కోసమే అంటారు. అలాంటి కూడు దొరకక  ప్రపంచంలో  ప్రతి నిమిషానికి  11 మంది ఆకలితో చనిపోతున్నారు.  దీనికితోడు  ఆర్థిక సంక్షోభం, కరోణ, అంతర్గత యుద్ధాలు  వీటన్నిటినీ కలిపి ఆకలి చావులు పెరగడానికి దారితీస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆక్స్ ఫామ్ సంస్థ  తన నివేదికలో వెల్లడించింది.

అనేక దేశాలు  కరోణ  విజృంభిస్తున్న  ఎంతో మందిని బలి తీసుకుంటుంది అని ఆ సంస్థ  తెలిపింది. దీంతో  ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి  11 మంది  తిండి లేక ఆకలితో మరణిస్తున్నారని ఆ నివేదిక ద్వారా తెలియ జేసింది. ప్రపంచవ్యాప్తంగా పేదరికం, ఆకలి చావుల పైన ఈ యొక్క సంస్థ  హంగర్ వైరస్ మల్టీ ఫైల్స్ పేరుతో  ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుత కాలంలో  15 కోట్ల మంది  అత్యంత దారుణమైన ఆకలి సంక్షోభ పరిస్థితులలో ఉన్నారని  ఈ సంస్థ హెచ్చరించింది. గత సంవత్సరంతో పోలిస్తే  ఈ ఏడాది  ఈ సమస్య రెండు కోట్లు పెరిగిందని తెలిపింది. ఇందులో రెండు వంతుల మంది  తమతమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణ వల్ల  ఆకలితో అలమటిస్తున్నారు అని ఈ నివేదిక తెలియజేసింది. కరోనా మహమ్మారి కంటే  ఈ కరువు పరిస్థితులతో  ప్రజలు ఎక్కువగా అలమటిస్తున్నారని, కరోణ కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు, మరణిస్తు ఉంటే  ఆకలితో మాత్రం 11 మంది మరణిస్తున్నారని, ఇప్పటికే  ప్రకృతి విపత్తులు, కరోణ తెచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా చుట్టుముడుతున్న   కొన్ని దేశాలలో మాత్రం వారి అంతర్గత యుద్ధాలు  ఇక్కడి ప్రజలకు శాపంగా మారుతున్నాయి అని  ఆక్స్ ఫామ్ సీఈవో అబె మాక్సమ్ ఆవేదన చెందాడు.

మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా  మిలటరీలో ఖర్చు సుమారుగా 3.81 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. పేదరిక నిర్మూలన, ఆహార కొరత ఆపేందుకు ఐక్యరాజ్యసమితి ఖర్చు చేయాలనుకున్నా దానికన్నా  ఇది ఆరు రెట్లు పెరిగిందని ఆక్స్ ఫామ్ తెలిపినది. ప్రపంచ దేశాలలోని  ప్రభుత్వాలన్నీ ఈ యుద్ధం ఆపాలని, అప్పుడే ఆకలిచావులు అరికట్టగలం అని ఈ సంస్థ  ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: