కరోనా థర్డ్‌ వేవ్.. ఇప్పుడు అందరినీ భయపెడుతున్న అంశం ఇది. కొన్ని పరిశోధన సంస్థలు ఆగస్టులో కరోనా మూడో వేవ్ వస్తుందని.. ఇంకొందరు సెప్టెంబర్‌లో వస్తుందని కొన్ని రోజులుగా అంచనా వేస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతోంది. సెకండ్‌ వేవ్‌లో ఒక దశలో రోజుకు నాలుగు లక్షల కేసుల వరకూ వచ్చాయి. అక్కడి నుంచి ఇప్పుడు రోజూ 50 వేల దిగువన మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ఇది సంతోషం కలిగించే విషయం అయినా.. ఈ కేసుల సంఖ్య తగ్గుదలలో ఇప్పుడు వేగం తగ్గుతోంది.


కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నా తగ్గుదలలో వేగం తగ్గింది. అంతే కాదు.. మొన్న ఒకటి రెండు రోజులు కాస్త కేసుల సంఖ్య గతం రోజు కంటే పెరిగింది కూడా.. దీంతో అప్పుడే ఇండియాలో థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న వాదన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ మారింది. తాజాగా ఇండియాల లో కేసుల సంఖ్య బాగా తగ్గింది. మరణాలు కూడా తగ్గాయి. తాజాగా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇది కాస్త ఊరటనిస్తోంది. ఇక అంతకు ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది.


ఇండియాలో తాజాగా 35వేల కేసులు వెలుగు చూశాయి. ఇక మరణాలు కూడా 500లోపే నమోదయ్యాయని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. గురువారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 16 లక్షల మందికి  పరీక్షలు నిర్వహిస్తే 35,342 మందికి పాజిటివ్‌ వచ్చింది. 24 గంటల వ్యవధిలో 483 మంది కరోనాతో మరణించారు. ఈ కేసుల తగ్గుదల ఓ మంచి పరిణామమే.. దీన్ని చూస్తే ఇంకా కరోనా థర్డ్ వేవ్ ఇండియాలో ప్రారంభం కాలేదనిపిస్తోంది.


అయితే.. కేవలం కేంద్రం చెప్పే లెక్కల ఆధారంగా ఈ కంక్లూజన్‌కు రాలేం. ఎందుకంటే.. కేంద్రం లెక్కల్లో ఒక్కోసారి భారీ తేడాలు ఉంటున్నాయి. మొన్న ఒకే రోజు 3 వేలకుపైగా మరణాలు చూపించింది కేంద్రం. ఏదేమైనా కేసులు తగ్గడం మాత్రం శుభపరిణామమే.

మరింత సమాచారం తెలుసుకోండి: