ఏపీ సీఎం జ‌గ‌న్ కేబినెట్ లో మొత్తం ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్సీ సామాజికవర్గం నుంచి ఇద్దరు మహిళా మంత్రులను కేబినెట్లోకి తీసుకున్న జగన్... ఎస్టీ కోటాలో మరో మహిళా మంత్రిని సైతం క్యాబినెట్ లోకి తీసుకున్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేమేకతోటి సుచరిత కు కీలకమైన హోం మంత్రి పదవి కట్టబెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత కు స్త్రీ శిశు సంక్షేమ శాఖ పదవి ఇచ్చారు. విజయనగరం జిల్లాలోని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి మంత్రి పదవితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు.

రెండున్నరేళ్ల పదవీకాలం ముగుస్తుండ‌డంతో ఈ ముగ్గురు మహిళా మంత్రుల్లో ఎవరు ? క్యాబినెట్ లో కొనసాగుతారు ఎవరు ? బయటకు వెళ్తారు అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హోంమంత్రిగా ఉన్న సుచ‌రిత బెర్త్ సేప్‌. అయితే ఆమె శాఖను మార్చొచ్చు అన్న ప్రచారం అయితే ఉంది. ఇక మిగిలిన ఇద్దరు మహిళా మంత్రులు తానేటి వనిత , పుష్పశ్రీవాణి కేబినెట్‌ నుంచి బయటకు వెళ్లక తప్పదని అంటున్నారు. పుష్పశ్రీవాణి స్థానంలో ఎస్టి కోటాలో మ‌ళ్లీ మహిళకు ఛాన్స్‌ ఇవ్వాలనుకుంటే పాలకొండ ఎమ్మెల్యే కళావతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

లేనిపక్షంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడికల‌ రాజన్నదొర లో ఒకరికి ఛాన్స్ రావచ్చు. ఇక తానేటి వనితను తప్పిస్తే ఎస్సీ కోటాలో మ‌ళ్లీ మ‌హిళ‌నే తీసుకోవాల‌నుకుంటే అనంత‌పురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి లేదా మరో మహిళ నేతకు దక్కవచ్చని అంటున్నారు. ఏదేమైనా ముగ్గురు మహిళా మంత్రుల్లో ఇద్దరు ఖ‌చ్చితంగా క్యాబినెట్ నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ‌రి అంతిమంగా జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: