రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభకు టిఆర్ఎస్ నేతలు హాజరు ఎంత కీలకమో ఏపీ నుంచి వైసీపీ నేతల హాజరు అంతే ముఖ్యం. సభ కు ఏపీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా! అన్న మీమాంస ఒక‌టి పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. నాటి క్యాబినెట్ లో కీల కంగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. సబిత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, సునీతా లక్ష్మారెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ రోజు మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల్లో డీకే అరుణ ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఆమెకు పిలుపు ఉందో లేదో అన్న‌ది స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం అయితే లేదు.


నాటి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల్లో బొత్స సత్య నారాయణ ఏపీ రాజకీయాల్లో నాటి నుంచి నేటి వరకు కీలకంగా ఉంటూ నే ఉన్నారు. కొంత‌కాలం పీసీసీ చీఫ్ గా వ్య‌వ‌హ‌రించారు. స‌మైక్యాంధ్ర ఉద్య‌మాల్లో వివాదా ల‌ కు కార‌ణం అయ్యారు. ధర్మాన ప్రసా దరావు రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కొద్దికాలం కాంగ్రెస్లో ఉండి, తర్వాత వైయస్ జగన్ వెంట నడిచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మె ల్యేగా గెలిచారు కానీ జగన్ వారికి మంత్రి పదవి ఇవ్వ లేదు. ఇదే సమయంలో ఉండవల్లి లాంటి సీనియర్ నాయకులు రఘువీరా లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట నడిచేందుకు ఇష్టపడలేదు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి పూర్వ మిత్రులు చాలామంది జగన్ వెంట నడవలేదు. జగన్ కొంతకాలం తెలంగాణపై పట్టు సాధించేందుకు ప్రయత్నించిన అనుకున్నంత విధంగా ఫలితాలు అందుకోలేక‌పోయారు. ఖమ్మం వాకిట ఎంపీగా పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గెలుపు మినహా గొప్ప విజయాలు జ గన్ ఖాతాలో లేవు.


కొండా సురేఖ దంపతులు జగన్ వెంట నడిచిన తర్వాత కాలంలో వారు కూడా తప్పుకున్నారు. సీమకు చెందిన చాలామంది నే తలు జగన్ వెంట వచ్చేందుకు తొలినాళ్లలో ఇష్టపడలేదు.  అనంత‌పురానికి చెందిన జెసి బ్రద ర్స్ బాహాటంగానే జగన్ను వ్యతిరేకిం చారు. జగన్ ఆంధ్ర తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా చక్రం తిప్పాలని తపన పడ్డారు. గాలి సోదరుల సాయంతో ఆర్థికంగా మై నింగ్ వ్యవహారాల్లో లబ్ధి పొందిన జగన్ తర్వాత కాలంలో సంబంధిత కుటుంబాలకు దూరం అయ్యారు. స‌భ‌కు సంబంధించి జగన్ రాక రేపటి వేళ ఉన్నా, లేకున్నా రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ సహచరులు కొందరు ఇప్పటికీ వైయస్ కు విధేయులే!


అదేవిధంగా జ ర్నలిజం సర్కిళ్ల‌లో కూడా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు. వీరంతా అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రలో నూ రాజశేఖర్ రెడ్డి బిడ్డలకు మద్దతుగా ఉండాలని అని విజయమ్మ వ్యూహం. కానీ రాజశేఖర్ రెడ్డి నడవడి, వ్యక్తిత్వం వారి పిల్ల లకు రాలేదని కొందరు ఇప్పటికీ బాధపడుతుంటారు. వారికి సామాన్యుల కష్టాలు తెలుసుకోవడానికి 12 ఏళ్ల సమయం సరిపోలే దని అందరూ కాకపోయినా కొందరు విమర్శిస్తారు. ఈ తరు ణంలో జగన్ క్యాబినెట్ సహచరులు, కెసిఆర్ క్యాబినెట్ సహచరులు, కాంగ్రెస్ పార్టీ కీ లక నాయకుల ఇంకా ఇంకొంద‌రు వీరంతా సభా ప్రాంగణంలో ఉండాలని విజయమ్మ కోరిక. కానీ ఈ కోరిక వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉ న్నకారణంగా చాలామంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు, నాయకులు, ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు వచ్చే అవకాశం లేదు. కానీ విజయమ్మ ఆహ్వానాలు రేపటి రాజకీయాలను పరిపూర్ణ స్థాయిలో ప్రభావితం చేస్తాయా అన్నది కూడా చె ప్పలేం!

మరింత సమాచారం తెలుసుకోండి: