రష్యాకు చెందిన ఒకే డోసు వ్యాక్సిన్.. స్పుత్నిక్ లైట్ మన దేశంలో విడుదల చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మూడవ దశ క్లినియల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఇందులో సానుకూల ఫలితాలు లభిస్తే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ మన దేశంలో విక్రయించేందుకు అనుమతి లభించే అవకాశముంది.

మరోవైపు కరోనా నియంత్రణ టీకా మోడెర్నాతో.. రోగ నిరోధక శక్తి కనీసం ఆరు నెలల పాటు ఉంటుందని ఓ అధ్యయనం తేల్చింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్ వారికి మళ్లీ బూస్టర్ డోసులు అవసరం కూడా రాలేదని ఓ సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. మోడెర్నాతో బలమైన రోగ నిరోధక శక్తి, యాంటీబాడీల వృద్ధి ఉంటుందని తెలిపింది. అన్ని వయస్కుల వారిపై ఈ వ్యాక్సిన్ ను పరీక్షించినట్టు పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో 18ఏళ్లు పైబడిన వారు 2.80కోట్ల మంది ఉండగా.. ఇప్పటి వరకు 1.45కోట్ల మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇక 55లక్షల మంది రెండో డోసు పొందగా.. ఒక్క డోసు కూడా తీసుకోని వారు 80లక్షల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. అయితే రానున్న రెండు వారాల్లో మరో కోటి మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రోజుకు 3నుండి 5లక్షల మందికి టీకా వేసేందుకు లక్ష్యం నిర్ధేశించుకుంది.

ఇక దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే 1.24శాతం కేసులు అత్యధికంగ నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 30వేల 570మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రస్తుతం 3లక్షల 42వేల 923యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 38వేల 303మంది మహమ్మారి బారి నుండి బయటపడ్డారు. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 76.57కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. మొత్తానికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ పై థర్డ్ స్టేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే కరోనా నుండి బయటపడినట్టే.











మరింత సమాచారం తెలుసుకోండి: