ఏపీలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఉద‌యం నుంచే ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీ త‌న ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌న‌ప‌రుస్తోంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పూర్తిగా స్వీప్ చేస్తుంటే మ‌రో వైపు టీడీపీ ఖాతా తెరిచే ప‌రిస్థితి లేదు. గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ స్వీప్ చేసి ప‌డేసింది. ఇక్క‌డ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విప్ పిన్మెల్లి రామ‌కృష్నా రెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు.

ఆయ‌న అక్క‌డ ఓట‌మి లేకుండా వ‌రుస‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తున్నారు. విచిత్రం ఏంటంటే పీఆర్కే వైసీపీ నుంచే ఉప ఎన్నిక‌ల‌తో క‌లుపుకుని అక్క‌డ మూడో సారి గెలిచారు. ఇప్ప‌టికే మాచ‌ర్ల మున్సిపాల్టీని కూడా స్వీప్ చేసేసిన పీఆర్కే ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ నూటికి నూరు శాతం విజ‌యాలు సాధించి రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ అదే జోరు చూపించారు. నియోజకవర్గంలో మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

మండ‌లాల వారీగా చూస్తే దుర్గి మండలంలో మొత్తం ఎంపీటీసీ  స్థానాలు 14 - వెల్దుర్తి మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14 - కారంపూడి మండలం లో మొత్తం ఎంపీటీసీ 15 - రెంటచింతల మండలం మొత్తం ఎంపీటీసీ స్థానాలు 14  వైసీపీ ఖాతాలో ఏక‌గ్రీవంగా ప‌డ్డాయి. మొత్తం మాచ‌ర్ల నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మొత్తం ఐదు జ‌డ్పీటీసీ స్థానాలు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అస‌లు ఇక్క‌డ టీడీపీ ఖాతాయే తెర‌వ‌లేదు.

అటు మున్సిపాల్టీ లోనూ.. ఇటు పంచాయ‌తీల్లోనూ.. ఇక ఇప్పుడు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల్లోనూ టీడీపీకీ ఒక్క సీటు కూడా ఇవ్వ‌లేదు అంటే ఇక్క‌డ వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా పీఆర్కే స‌త్తా మామూలుగా చూప‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: