ఇక ఇప్పుడు మరోసారి జగన్ గెలుపు కోసం పీకే టీం రంగంలోకి దిగుతున్నారన్న వార్తలతో వైసీపీ వర్గాలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. మనం 151 సీట్లతో ప్రతిపక్షాలను చిత్తు చేశాం.. స్థానిక ఎన్నికలలో అసలు ప్రతిపక్షాలకు దిక్కూ దివాణం లేకుండా పోయింది. ఈ టైంలో మళ్లీ ఈ ఉత్తరాది టీంలు ఎందుకంటూ వైసీపీ వీరాభిమానులే పోస్టులు పెడుతున్నారు. మన ఊళ్లో ఎలా ? రాజకీయం చేయాలో వచ్చి పీకే చెప్పాలా ? అని వారు మండి పడుతున్నారు. వైఎస్సార్ 2004లో గెలిచాక ఎందరు ఏకమైనా సింగిల్‌గా ఎన్నికలకు వెళ్లి 2009లో రెండో సారి పార్టీని అధికారంలోకి తెచ్చారు కదా ? అని గుర్తు చేస్తున్నారు.
జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన వెనక ఎవరు ? లేదరి.. 2014లోనూ ఒంటరిగానే చంద్రబాబు + బీజేపీ + జనసేన కూటమిని ఢీ కొట్టారని ఇప్పుడు ఇంత ఫుల్ స్వింగ్ లో ఉండగా.. ఈ ఉత్తరాది టీంలతో పని ఎందుకని వారు అధిష్టానాన్ని సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. కోట్లాది మందిని కలిపే సోషల్ మీడియా ఉంది.. పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉన్నారు ? వీరిని కాదని ఉత్తరాది టీంలతో మనకు పనిలేదని వారు అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ? ఉంటుందో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి