2018 మార్చి 9వ తేదీ నుంచి ఇది వర్తింప చేస్తున్నట్లుగా డైరెక్టర్ బలరాం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కారుణ్య ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇప్పటివరకు కేవలం అవివాహిత కుమార్తెలు కుమారుడు చట్టప్రకారం దత్తత తీసుకున్న కుమారుడికి మాత్రమే అవకాశం కల్పించే వారు. ఒకవేళ వీరు లేకపోతే ఉద్యోగి తో పాటు నివసిస్తూ అతని జీవితం పైన ఆధారపడిన సోదరుడు, కుమార్తె కోడలు అల్లుడికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు మాత్రం పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలు ఇద్దరు మహిళలకు కూడా కారుణ్య నియామకాలు అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
2018 నుంచి సింగరేణిలో అనారోగ్య కారణాలతో అన్ ఫిట్ అయిన ఉద్యోగుల స్థానంలో వారి వారసులకు కారుణ్య నియామకాల కల్పించడానికి సిద్ధమయ్యాయి. త్వరలో ఈ నియామక ప్రక్రియను సింగరేణి సంస్థ అమలు చేస్తోంది అంటూ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ లో తెలిపారు. ఇప్పటివరకు ఇలా 82 వరకు మెడికల్ బోర్డు నిర్వహించి దాదాపు 7 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించాము అన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. పెళ్లయిన కుమార్తెలు విడాకులు పొందిన కుమార్తె ఒంటరి మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అంటూ విజ్ఞప్తి వచ్చిందని దీనిపై ఇక ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి