జొమాటో  ప్రస్తుతం భారత్లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. కస్టమర్లకు ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలు అందిస్తూ తమ కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ దూసుకుపోతుంది.  ఫుడ్ డెలివరీ సంస్థల్లో జొమాటో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వినూత్నమైన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడం లో కూడా ముందు ఉంటుంది. అయితే ఇటీవలే జొమాటో కి కస్టమర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇక అందరిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.



 హిందీ రాని కస్టమర్ ని హిందీ నేర్చుకోవాలి అంటూ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడటం సంచలనంగా మారింది. ఇదంతా కూడా సోషల్ మీడియా లో కేక్కించాడు ఆ కస్టమర్. ఇక ఇది కాస్త సంచలన గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే తమిళనాడుకు చెందిన వికాస్ అనే వినియోగదారుడు షేర్ చేసిన పోస్ట్ కాస్త ప్రస్తుతం హిందీ భాషను ఖండిస్తూ వేలాది మంది పోస్టులు పెట్టే విధంగా మారిపోయింది. వికాస్ చేసిన పోస్టు వైరల్ గా మారగా తర్వాత రిజెక్ట్జోమాటో అనే హాస్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చివరికి జోమాటో సంస్థ దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చేదుఆ కస్టమర్కి క్షమాపణలు చెప్పింది.



 ఆన్లైన్ ద్వారా వికాస్ ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే జొమాటో యాప్ ద్వారా చాట్ ఫీచర్తో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి సహాయం పొందాలని నిర్ణయించుకున్నాడు. అతని సమస్య పరిష్కారం కాలేదు. అంతేకాదు వికాస్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కూడా ప్రతి ఒక్కరు హిందీ తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే హిందీ జాతీయ భాష కూడా అంటూ సమాధానం చెప్పడం అసంతృప్తిగా అనిపించింది. ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు వికాస్. మీరు కస్టమర్ తో మాట్లాడే విధానం ఇది కాదు అంటూ పోస్ట్ చేశాడు. ఇటీవలే వికాస్ కి రిప్లై ఇచ్చింది జోమాటో. హాయ్ వికాస్ మీకు జరిగింది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు మేము దీనిపై తనిఖీ చేయాలనుకుంటున్నాము దయచేసి మీరు మీరు కాంటాక్ట్ నెంబర్ ని ప్రైవేట్ మెసేజ్ చేయగలరు అంటూ రిప్లై ఇచ్చింది జొమాటో.

మరింత సమాచారం తెలుసుకోండి: