దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి  తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు వంట గ్యాస్ ధర కూడా సామాన్యుడికి భారంగా నే మారిపోతుంది. దీంతో చాలీచాలని జీతాలతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ బతుకుబండిని నడిపిస్తున్నాడు సామాన్యుడు. ఇలాంటి సమయంలో అటు  పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతు ఉండటం  మాత్రం సామాన్యుడి నడ్డి విరుస్తుంది అని చెప్పాలి.  రోజురోజుకూ పెట్రోల్ ధరలు పెరుగుదలతో సామాన్యుడు ఇబ్బందిపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.



 పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీది తప్పు అంటే మీదే తప్పు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప సామాన్యుడి ఆవేదన మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అయితే ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేసాయి అనే విషయం తెలిసిందే.  ఇక సెంచరీ కొట్టిన తర్వాత కూడా పెట్రోల్ ధరల పెరుగుదల అదే రీతిలో కొనసాగుతూనే ఉంది. అంతకంతకు పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటం మాత్రం సామాన్యుడి వెన్నులో వణుకు పుట్టిస్తుంది.  దీంతో వాహనం బయటికి తియ్యాలి అంటేనే భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు  . కాగా నేడు మళ్లీ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి.



 కాగా నేడు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రధాన నగరాల్లో పూర్తిస్థాయి పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 106.19/ లీటర్(రూ.0.35పెరిగింది) & లీటర్ డీజిల్ రూ. 94.92లీటర్ (రూ.0.35 పెరిగింది).

ముంబైలో పెట్రోల్ రూ. 112.11/లీటర్ (రూ.0.34పెరిగింది), డీజిల్ రూ .102.89/లీటర్(రూ.0.37 పెరిగింది)

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 106.77/లీటర్ (రూ.0.34పెరిగింది) & డీజిల్ రూ. 98.03/లీటర్(రూ.0.35 పెరిగింది)

చెన్నైలో పెట్రోల్ రూ .103.31/లీటర్(రూ.0.15పెరిగింది)& డీజిల్ రూ. 99.26/లీటర్(రూ.0.19పెరిగింది)

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.110.46(రూ.0.37పెరిగింది), డీజిల్‌ లీటర్ రూ.103.56(రూ.0.38పెరిగింది).

మరింత సమాచారం తెలుసుకోండి: