
జమ్మికుంటకు చెందినటువంటి సిరివేరు శ్రీకాంత్ ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థి అయిన వ్యక్తికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. గతంలో కూడా శ్రీకాంత్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీలో ఉండి ఇలాంటి ప్రచారం నిర్వహించకుండానే ఓట్లను కొల్లగొట్టాడు. ఆయనకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఆరవది. అయితే 2019 సంవత్సరంలో కరీంనగర్లోని ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి 6810 ఓట్లు, 2019 హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి 585 ఓట్లు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో నిలబడి 595 ఓట్లు, అలాగే నాగార్జునసాగర్ ఎన్నికల్లో 56 ఓట్లు సాధించారు. ప్రస్తుతం ఆయన హుజురాబాద్ లో ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసి ఎన్నికల కమిషన్ తో గొడవకు దిగి మరి రోలింగ్ ఫిన్ గుర్తు సాధించాడు. ఇలా కారు గుర్తును పోలినటువంటి గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించరాదని వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ గట్టి పోరాటానికి దిగింది. కానీ ఎన్నికల సంఘం తెరాస అభ్యర్థనను పట్టించుకోలేదు. మళ్లీ హుజురాబాద్ లో అతనికి గుర్తు కేటాయించడం వలన టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు.