
చైనా తయారు చేసిన వ్యాక్సిన్ నే పేరు మార్చుకుని రష్యా వాడింది. రెండు దేశాల వ్యాక్సిన్ దాదాపు ఒకటే అని చెప్పాలి. అయితే, ఒక అపాయాన్ని రోడ్డు మీద వదిలేసి అది మనం చెప్పినట్టుగా నడవాలనుకోవడానకి మించిన తెలివి తక్కువ పని ఏం ఉండదనే చెప్పాలి. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఉగ్రవాదులను తయారు చేసి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయగలదా అంటే అసాధ్యం అనే చెప్పాలి.
ఉగ్రవాదాన్ని ఎలాగైతే కంట్రోల్ చేయలేమో.. జబ్బులు కూడా అంతే. ఎందుకంటే కరోనాను సృష్టించింది చైనానే అని అంతర్జాతీయంగా ఉన్న వాదన అనే చెప్పాలి. ఇప్పుడు అవే రష్యా చైనాలను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించుకుంటే. అదే విధంగా డ్రాగన్ దేశం చైనా కూడా వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించింది. అలాగే తాజాగా అంతర్జాతీయ విమానాలను కూడా నిలిపివేస్తోంది.
ఎవరు తీసిన గొయ్యిలో వారే పడుతారన్న చందంగా కరోనాకు మూలంగా మారిన చైనా ఇప్పుడు అదే జబ్బు కారణంగా బాధపడుతోంది. ఈ క్రమంలో మొదట్లో చైనాలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గి ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు తగ్గి కరోనా కు మూలం అయిన డ్రాగన్ దేశంలో ఇప్పుడు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మళ్లీ లాక్డౌన్ దిశగా చైనా నిర్ణయం తీసుకుంటోంది. దశల వారీగా వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ విదిస్తూ వస్తోంది.