ఈ ఉప ఎన్నికకు పెద్ద గా పార్టీ నేతలను అక్కడ మోహరించాల్సిన అవసరం కూడా లేదని జగన్ ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తో పాటు జనసేన కూడా పోటీ చేయడం లేదు. అందుకే జగన్ తాను రాకుండానే లక్ష మెజార్టీ రావాలని స్థానిక నేతలకు టార్గెట్ పెట్టారు. జగన్ ప్రచారానికి రాకుండా కూడా లక్ష మెజార్టీ వస్తేనే అప్పుడు కిక్ ఉంటుందని జగన్ భావిస్తున్నారట. ఎక్కువ పోలింగ్ జరిగితే జగన్ పెట్టిన లక్ష మెజార్టీ టార్గెట్ పెద్ద కష్టమేం కాదు.
తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో మెజార్టీ అయితే రాలేదు. జగన్ కూడా అప్పుడు అసంతృప్తి చెందారు. అయితే అప్పుడు కరోనా ఉందని వైసీపీ నేతలు జగన్ కు సాకులు చెప్పి ఆయన కోపాన్ని చల్లార్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. మరి జగన్ ప్రచారానికి రాకుండానే బంపర్ మెజార్టీ కొట్టిస్తే మనోడి రేంజ్, క్రేజ్ మరింత గా పెరుగుతుందనేది వేరే చెప్పక్కర్లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి