జగన్ సైతం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుని పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే లకు వార్నింగ్ లు ఇస్తూనే వస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ఏపీ లో జగన్ ప్రభుత్వం పై న, జగన్ పై కంటే కూడా లోకల్ గా ఎమ్మెల్యేలపైనే ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మరో సారి జగన్ కోసం పీకే రంగంలోకి దిగుతున్నారు. 2022 మార్చి నుంచి పీకే రంగంలోకి దిగి ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పని తీరుపై నివేదికలు ఇవ్వను న్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు పీకే ఇక్కడ జగన్ కోసం పశ్చిమ బెంగాల్ ఫార్ములా ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అక్కడ మమతా బెనర్జీ మూడో సారి అధికారంలోకి వచ్చారు. అయితే చాలా మంది ఎమ్మెల్యే లపై వ్యతిరేకత ఉంది. అక్కడ జనాలు మమత పట్ల ప్రేమతో ఉన్నా ఎమ్మెల్యేల పని తీరుపై ఆగ్రహం తో ఉన్నారు. అందుకే పీకే గత ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్ లకు టిక్కెట్లు రాకుండా చేశారు.
కొత్త వారితో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ఫార్ములా ను ప్రయోగించి మళ్లీ జగన్ ను సీఎం ను చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. మరి పీకే వ్యూహాలు ఈ సారి జగన్ కు ఎంతలా వర్కవుట్ అవుతాయో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి