సాధారణంగా వైద్యులు అన్న తర్వాత ఎన్నో రకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు.. అంతే కాదు ఎంతో చిత్రవిచిత్రమైన వ్యాధులతో బాధపడే పేషంట్ల ను కూడా చూస్తూ ఉంటారు. దీంతో ఇక ఎంత వింత జబ్బుతో డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పటికీ అలాంటిది డాక్టర్ లు పెద్దగా  ఆశ్చర్యపోరూ. కాని కొన్ని కొన్ని సార్లు ఏకంగా డాక్టర్లే ఆశ్చర్యపోయే ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఏకంగా అది చూసి ఇది నిజంగానే నిజమా అని డాక్టర్లకే నమ్మడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు జన్యుపరమైన లోపం కారణంగా జన్మించిన శిశువు వింత ఆకారాల్లో జన్మించడం చూస్తూ ఉంటాం.


 ఇక అలాంటి వింత ఆకారం లో జన్మించినప్పుడు డాక్టర్లు సైతం ఆశ్చర్య పోవడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పాలి. ఆమె గర్భం దాల్చింది ఇక తరచూ వైద్యులను సంప్రదిస్తూ వైద్యులు సూచించిన మందులను వాడుతూ వచ్చింది. అయితే వైద్య పరీక్షలు చేసిన  సమయంలో కూడా వైద్యులు లోపల పిండం బాగానే ఉంది అని చెప్పారు. కానీ డెలివరీ అయిన తర్వాత మాత్రం శిశువు  ఆకారాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వైద్యులు తాము కళ్ళతో చూస్తుంది నిజమేనా అని కూడా నమ్మలేక పోయారు. ఈ ఘటన బ్రెజిల్ లో వెలుగులోకి వచ్చింది.


 పోర్టలేజా అనే పట్టణానికి చెందిన ఒక మహిళా 35 వారాల గర్భిణీ గా ఉంది. అయితే పురిటి నొప్పులతో ఆల్బెర్ట్ సాబిన్ ఆస్పత్రిలో చేరింది సదరు మహిళ.  అయితే ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఇక శస్త్రచికిత్స చేసి మగ శిశువును బయటకు తీశారు వైద్యులు. కానీ ఆ శిశువు ఆకారాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఆ బాలుడి కి తోక ఉంది.. అది కూడా ఏకంగా 12 సెంటీ మీటర్లు ఉంది. ఇలా 12 సెంటీమీటర్లు ఉన్న ఇక చివర్లో నాలుగు సెంటీమీటర్ల దూరంలో ఒక బంతి లాంటి ఆకారం కూడా ఉండటం గమనార్హం. గతంలో వైద్య పరీక్షలు చేసినప్పుడూ కనిపించని తోక ఆనవాళ్లు ఇటీవలే డెలివరీ అయిన తర్వాత శిశువులో కనిపించడంతో వైద్యులు మరింత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అయితే ఆ తోక కేవలం చర్మానికి మాత్రమే పెరిగిందని లోపల నాడీ వ్యవస్థతో తోకకు ఎలాంటి సంబంధం లేదని వైద్యులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: