ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు నిబంధనలు పాటించాలని అటు పోలీసులు ఎంతలా మొత్తుకున్నప్పటికీ అటు వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడం లేదా అతి వేగం కారణంగా రోడ్డు ప్రమాదాల బారిన పడటం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి.


 కానీ కొన్ని కొన్ని సార్లు చిత్రవిచిత్రమైన ఆక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అతను వేగంగా ద్విచక్ర వాహనం పై వస్తున్నాడు. అంతలో మలుపు వచ్చింది. ఈ క్రమంలోనే బ్రేక్ పట్టి ఇక ఆ మలుపునుండి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ అంతలో బ్రేక్ ఫెయిల్.. ఏం చేయాలో అర్థం కాలేదు.



 దీంతో ఇక తనకు ఎదురుగా ఉన్న బట్టల షాపులోకి దూసుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. అయితే ఈ ప్రమాదంలో అతనికి చిన్న గాయం కూడా అవ్వకపోవడం గమనార్హం. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది. ఒక వ్యక్తి బైక్ తో సహా నేరుగా రావి చెట్టు బజారులో ఉన్న ఓ క్లాత్ సెంటర్లో కి తీసుకెళ్లాడు. దీంతో ఇక ఆ షాపులో ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు భయపడిపోయారు. షాప్ లోకి దూసుకు వెళ్ళిన పల్సర్ బైక్ కౌంటర్ను  ఢీ కొట్టింది. దీంతోఇక బైక్ పై ఉన్న వ్యక్తి కౌంటర్ వెనకాల పడ్డాడు. దీంతో బైక్ కింద పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: