సాధారణంగా ఒక అమ్మాయి భార్యగా రావాలి అంటే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీని కోసం ఇరు కుటుంబాలు ముందుగా మాట్లాడుకుని అన్ని లాంచనాలు కుదిరిన తర్వాత ఒక మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఇక పెళ్ళి తంతు జరిపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ  ఇక్కడ మాత్రం మీకు భార్య కావాలి అనిపిస్తే ఇక ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు.. ఎందుకంటే మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల వరకు ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అలా అద్దెకు తీసుకుని ఆ అమ్మాయి మానసికంగా శారీరకంగా కూడా అచ్చం భార్యలాగే ఉంటుంది.



పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకోవడం ఏంటి.. అలా అద్దెకు తీసుకున్న అమ్మాయి మానసికంగా శారీరకంగా కూడా భార్య లాగా ఉండటం ఏమిటి.. ఇలాంటివి ఆఫర్లు కూడా ఉన్నాయా అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అయితే ఇది ఆఫర్ కాదు ఏకంగా ఒక వింత ఆచారం.. ఇది ఎక్కడో విదేశాల్లో అనుకుంటే మాత్రం పొరబాటే.. ఎందుకంటే ఇది మన దేశంలోనే.  మన దేశంలో ఎవరికీ తెలియని కొన్ని వింత ఆచారాలు అప్పుడప్పుడు తెర మీదికి వస్తే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఒక వింత ఆచారమే ఇప్పుడు తెరమీదికి వచ్చింది.



 మధ్యప్రదేశ్లో ఇక ఈ వింత ఆచారం కొనసాగుతోంది. శివపురి జిల్లాలో ఏకంగా అమ్మాయిలను భార్యలుగా అద్దెకిచ్చే దడిచా సంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం ధనవంతులు డబ్బులు ఇచ్చి నెల లేదా ఏడాది ఇలా అవసరాలు తీరే వరకు కూడా ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తీసుకుంటారు. దీనిపై ఇరు కుటుంబాలు స్టాంపు పేపర్లపై సంతకాలు కూడా చేస్తారు. ఇలా అద్దెకు వెళ్లిన మహిళా మానసికంగా శారీరకంగా వారితో భార్యగానే ఉండాలి. తక్కువ వయసున్న కూడా వారికీ అక్కడ డిమాండ్ ఎక్కువ డిమాండ్ ఉందట. పోలీసులు ఈ వింత ఆచారాన్ని మానుకోవాలని హేచ్చరించిన కూడా  జనాలు తీరు మార్చుకోవట్లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: