ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. జగన్ కు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తల్లి వైఎస్ విజయలక్ష్మి తో పాటు ... సోదరి వైఎస్ షర్మిల అండగా ఉంటూ వచ్చారు. 2012 ఉప ఎన్నికల సమయంలో జగన్ జైలులో ఉన్నప్పుడు విజయలక్ష్మి , షర్మిల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల‌ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కూడా విజయలక్ష్మి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ఈ సమయంలో షర్మిల తనకు జగన్ లోక్సభ సీటు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ షర్మిల కు సీటు ఇవ్వలేదు.

అయినా ఆమె రాష్ట్రవ్యాప్తంగా అన్న గెలుపుకోసం ప్రచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అయినా తనకు ఏదో ఒక పదవి వస్తుందని షర్మిల ఆశలు పెట్టుకుంటే నెరవేరలేదు. దీంతో తల్లి విజయలక్ష్మి తో పాటు సోదరి షర్మిల కూడా జగన్ తో రాజకీయంగా విభేదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకోగా జగన్ తల్లి విజయలక్ష్మి సైతం షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తన భార్య వైఎస్ భారతి ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచార రంగంలోకి జగన్ దింపుతానని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఆమెను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కూడా దింపుతార‌ని తెలుస్తోంది. తమ సొంత నియోజకవర్గం పులివెందుల నుంచి భార్య భారతి ని పోటీలో పెట్టి ... జగన్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం లో కూడా వైఎస్ ఫ్యామిలీకి పార్టీలతో సంబంధం లేకుండా 40 వేల సొంత ఓటుబ్యాంకు ఉంది.

గత ఎన్నికల్లోనే అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డి ఏకంగా 53000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా అక్కడ టిడిపికి సరైన నాయ‌క‌త్వం లేదు. ఈ క్రమంలోనే జగన్ జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. మరి ఎన్నికల వేళ ఈ సమీకరణలు ఎలా ?మార‌తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: