చైనా ఇంకా భారత్ పై కుట్రలు చేస్తూనే ఉంది. శ్రీలంక భూభాగంలో వ్యాపారభాగస్వామ్యం అని చెప్పి కొత్త నాటకాలు ప్రారంభించడం చేసింది. కానీ దానిని భారత్ వ్యతిరేకించింది. శ్రీలంకలో ఉన్న దీవిలో చైనా ప్రాజెక్ట్ పేరుతో భారత్ పై నిఘా పెట్టడానికి పన్నాగాలు పన్నుతోంది. ఒక్కసారి అక్కడ ప్రాజెక్ట్ మొదలుపెడితే, దాని నుండి కూడా భారత్ పై దాడికి సిద్దపడవచ్చు అనేది చైనా కుట్రలు. అక్కడ నుండి సరాసరిగా తమిళనాడును లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనిని పసిగట్టిన భారత్ ముందే శ్రీలంకకు హెచ్చరికలు జారీచేసింది. అనుకున్న ప్రాజెక్ట్ కాకపోయే సరికి చైనా, శ్రీలంకను బెదిరించడం మొదలుపెట్టింది. అప్పుడు భారత్ దానికి అవసరమైన వనరులను సరఫరా చేస్తూ స్నేహభావాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసింది.  

శ్రీలంక కూడా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి, తమ దేశంలో ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ ప్రజల సభ ఒప్పుకుంటేనే కొనసాగుతుంది అని చైనాకు జవాబు ఇచ్చింది. చైనా ఇప్పటికి కూడా తన బుద్ది మార్చుకోకుండా ఎక్కడ వీలైతే అక్కడ భారత్ ను దెబ్బతీసే అంశాలు వెతుక్కుంటుంది. ఇప్పటికే చుట్టుముట్టే కోణంలో అటు పాక్ వైపుగా, ఇటు ఆఫ్ఘన్ వైపుగా, అలాగే తన దేశం నుండి దాడులు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. శ్రీలంక వైపు నుండి కూడా దాడి చేయాలని పన్నాగాలు పన్నినప్పటికీ, అది మధ్యలోనే ఆగిపోయింది.

గతంలో కూడా శ్రీలంక తనకు ఎరువులు కావాలని చైనాను అడగగా నాసిరకం పంపింది. అవి అసలు వాడుకునే స్థితిలో కూడా లేకపోవడంతో మళ్ళీ భారత్ వైపు చూసింది. అప్పుడు భారత్ శ్రీలంకకు కావాల్సిన ఎరువులు పంపించడం ద్వారా మంచి ముద్ర వేసుకుంది. అదే సందర్భంలో ఆ చైనా ప్రాజెక్టును ఆపాలని చర్చలు కూడా చేసింది. దానికి స్వయంగా సైన్యాధికారులు హాజరు కావడంతో త్వరగానే ఆ ప్రాజెక్ట్ కు చెక్ పడింది. దీనితో చైనా ను మరో దారి లో కట్టడి చేసినట్టే అయ్యింది. ఈ విధంగా భారత్ అన్ని వైపులా నుండి చైనాను గమనిస్తూనే ఉంది. ఎటువైపునుండి కూడా బలహీనపడేందుకు భారత్ సిద్ధంగాలేదు అనే సమాచారం సుస్పష్టంగా పంపించడంలో సఫలీకృతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: