ఫేస్‌బుక్ లైకుల్లో పెరిగిన పేట డవలప్‌మెంట్..
గత ఎన్నికల్లో తాము ఎంత తప్పు చేశామో పేట ప్రజలకు రెండేళ్లలోనే తెలిసొచ్చింది. అభివృద్ధి అన్న మాట లేదు.. తమ బాధ చెప్పుకునే వాళ్లు కూడా లేరు. ఎక్కడ చూసినా పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉంటోంది. అభివృద్ధి సున్నా... గొడవలు, కక్షల్లో సెంచరీ అన్నట్టుగా పేట పరిస్థితి ఉంది. 2014 - 19 మధ్య పుల్లారావు మంత్రిగా ఉండడంతో పేటలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరిగింది. పేట చరిత్రలోనే ఏ నేత చేయనంత అభివృద్ధి చేశారు. అయితే ఆయనపై చేసిన బ్యాడ్ ప్రాపగండా నేపథ్యంలో ఆయన ఓడిపోవాల్సి వచ్చింది.

పేటలో పేదలకు కట్టిన ఇళ్లు మూలనపడ్డాయి. పేట రహదారులు నరకానికి వెళ్లే మార్గాలయ్యాయి. ఈ రెండేళ్లలో అభివృద్ధిలో పేట పదేళ్లు వెనక్కు వెళ్లింది. అయితే పేట అభివృద్ధి ఫేస్‌బుక్ లైకుల్లో మాత్రం లక్షల్లోకి వెళ్లింది. ఇదొక్కటే ఈ రెండున్నరేళ్లలో పేటలో జరిగిన మేజర్ డవలప్‌మెంట్. అధికార పార్టీలో ఒక్కొక్కళ్లది ఒక్కో గ్రూపు... చివరకు పరిస్థితి ఎంత ఘోరంగా మారిందంటే.. సొంత పార్టీ ఎంపీ పేటలోకి వస్తే.. ఆ పార్టీ వాళ్లే ఆయనపై దాదాపుగా దాడి చేసేంత వరకు వచ్చేసింది. పేటజనాల్లోనూ ఆలోచన మొదలైంది ? ఇందుకా మనం మార్పు కోరుకుంది.. పుల్లారావు ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నారు ? ఏనాడైనా ఇలాంటి కక్షా రాజకీయాలు మనం చూశామా ? అని ఆలోచన చేస్తున్నారు.

ఫుల్ క్లారిటీతో పుల్లారావు :
ఇక టీడీపీలో పుల్లారావుకు ఫుల్ క్లారిటీ. ఆయన ఉన్నన్ని రోజులు పేట సీటు ఆయనకే. ఇది ఇప్పుడు కాదు.. బాబు పదేళ్ల క్రితం అన్నమాట. మరో పదేళ్లు అయినా.. పదిహేనేళ్లు అయినా పుల్లారావు కాదనుకుంటే తప్పా పేట సీటు ఆయన్ను కాదని మరొకరికి ఇవ్వరు. ఇటీవల వస్తోన్న పుకార్లకు ఆయన పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఇటు అటు పక్కంటారా ? ఇప్పుడు ఇద్దరు కాదు.. ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.. రేపు ఇంకెందరో..!
జగన్ పేటలో పార్టీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్న నేతను ఘోరంగా అవమానిస్తోన్న వైనం.. ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లోనే రగలించేస్తోంది. మా కడుపు మంట తీరాలంటే 2024యే సరైన ముహూర్తం అని వాళ్లు కాచుకుని ఉన్నారు. పేటలో రూరల్ ప్రాంతంలో గౌరవ మర్యాదలతో బతికే ఓ వర్గం, పేట పట్టణంలో గౌరవంగా ఉండే మరో వర్గం వాళ్లు తమకు జరుగుతున్న అవమానాలు బయటకు చెప్పుకోలేక.. లోపల అణుచుకోలేక పడుతోన్న ఆవేదన అంతా ఇంతా కాదు. ఏదేమైనా పుల్లారావులో అప్పుడే గెలుపు జోష్ అయితే వచ్చేసింది. ఆయన 2024 ఎన్నికల్లో పెద్దగా కష్టపడక్కర్లేదని స్థానిక జనాలే చెవులు కొరుక్కుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి