అయితే తైవాన్ ను తాము స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ అటు చైనా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అనే చెప్పాలి. తమ సార్వభౌమత్వాన్ని చైనా దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేమని.. తమ ప్రజలందరూ చైనా కు బానిసలుగా బతకడం కంటే ప్రాణాలకు తెగించిపోరాటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఇప్పటికే తైవాన్ అటు చైనా కు హెచ్చరికలు కూడా జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అటు చైనా సరిహద్దుల్లో కవ్వింపు లకు పాల్పడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే ప్రపంచదేశాలను ఏకం చేస్తూ మద్దతు కూడగట్టడంలో తైవాన్ సక్సెస్సవుతుంది. ఈ క్రమంలోనే మొన్నటి వరకు చైనాకు మిత్ర దేశంగా ఉన్న లిథువేనియా తాము తైవాన్ ను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నాము అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో కడుపుమంటతో ఏకంగా లిథువేనియా కు సంబంధించిన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తే నిషేధం విధించింది చైనా. ఇలాంటి సమయంలో తైవాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా లిథువేనియా లో 200 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడానికి తైవాన్ సిద్ధమైంది దీంతో చైనా కు షాక్ తగిలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి