దేశంలో రోజుకురోజుకు క‌రోనా విజృంభిస్తోంది.. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కొద్ది రోజులుగా ల‌క్షకు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి.. దీంతో కొత్త కేసుల సంఖ్య కూడా రెండు ల‌క్ష‌ల‌కు దాటేసింది. క‌రోనాతో ప్ర‌తి రోజూ 400 మందికి పైగా ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్ర‌మంలో పాజిటివిటీ రేటు పెరుగుతూ.. 11.05 శాతానికి చేరుకుంది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌లను మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు జారీ చేసింది. దీంతో మ‌రోసారి లాక్‌డౌన్ ఉంటుంద‌నే ప్ర‌శ్న‌లు వ్యక్తం అవుతున్న నేప‌థ్యంలో.. దేశంలో తాజా ప‌రిస్థితుల‌పై రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నేడు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు.


  దీంతో ప్ర‌ధాని స‌మావేశంలో తీసుకునే నిర్ణ‌యాల‌పై దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. క‌రోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధిస్తున్న ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు, వైద్య స‌న్న‌ద్ధ‌త‌, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఎలా కొన‌సాగుతుంద‌నే దానిపై మాట్లాడనున్నారు. అల‌గే వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, లాక్‌డౌన్ విధింపు లాంటి ప‌లు అంశాల‌పై ప్ర‌ధాని మోడి సీఎంల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.  కరోనా వైర‌స్‌ వ్యాప్తి, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల‌ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల క‌ఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే మకర సంక్రాంతి రోజు హరిద్వార్‌, రిషికేశ్‌లోని గంగానది ఘాట్‌ల వద్ద పవిత్ర స్నానాలపై నిషేదం అమ‌లులో ఉంది. ఢిల్లి ప్ర‌భుత్వం రెస్టారెంట్లు, బార్ల‌పై నిషేధం విధించింది.. ప్ర‌యివేటు కార్యాల‌యాల‌ను పూర్తిగా మూసివేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.



      ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ.. థ‌ర్డ్ వేవ్ ముంగిట దేశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో పాటు ఈ నెల చివ‌రి నాటికి క‌రోనా ఉధృతి తీవ్ర రూపం దాల్చుతుంద‌ని దీంతో థ‌ర్డ్ వేవ్ మొద‌ల‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న ముంబై, ఢిల్లీ నగరాల్లో రెండో ఉధృతి నాటి కల్లోలం సృష్టించ‌డం లేదు. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు పుష్క‌లంగా ఉండ‌డంతో.. వైర‌స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ ప్ర‌భావం తక్కువగా ఉండటంతో ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లో క‌ల్లోలం క‌నిపించ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: