తాడేపల్లి :  తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  గోశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఇక ఈ సంక్రాంతి వేడుకలలో  సతీసమేతంగా పాల్గొన్నారు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.  భోగి మంటలు,  కూచిపూడి నృత్యం, కోలాటాలు, హరిదాసులు, గోమాతకు పూజా కార్యక్రమాలు ఈ వేడుకల్లో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఘనంగా జరిగిన  ఈ సంక్రాంతి వేడుకలలో  గంటన్నరకు పైగా వేడుకల్లో పాల్గొన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు ఆయన సతీమణి భారతి.  అంతే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఇతర నేతలు.  ఇక ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  తాడేపల్లి లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి   నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయని..  సీఎం ఏ పని చేసినా మనసుతో చేస్తారని చెప్పారు.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సిరి సంపదలతో వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారన్నారు.   జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజు సంక్రాంతేనని వెల్లడించారు.  సంక్షేమ పథకాలు పొందుతున్న అందరూ ముఖ్యమంత్రి కి దీవెనలు అందిస్తున్నారు.. ఇవన్నీ సీఎంకు శ్రీరామ రక్ష అని కొనియడారు.  సంక్రాంతి అంటేనే తెలుగు వారి పండుగ అన్నారు. వైసీపీ  ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..  జగన్ మోహన్ రెడ్డి  సర్కార్ రైతు ప్రభుత్వమని.. ఈ పండుగ రైతులకు సంబంధించిన పండుగ అని చెప్పారు.  సతీసమేతంగా సీఎం రావటం ప్రత్యేకమని.. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంది అనటానికి ఇది ఒక నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తన ఇంట్లోనే గోశాలను పెట్టుకుని పూజించిన ఉదంతం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: