గత కొంత కాలం నుంచి ప్రపంచ దేశాలు చైనా విషయంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా చైనాలో మైనారిటీలుగా కొనసాగుతున్న వీకర్ ముస్లింల స్వేచ్ఛా హక్కులను కాలరాస్తూ చైనా ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ ఉండటంపై అమెరికా ఎన్ని రోజులనుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చైనాపై పలు నిషేధాలు విధించి షాకిచ్చింది అమెరికా. ఇటీవలే చైనా లో జరిగే బీజింగ్ ఒలింపిక్స్ ను దౌత్యపరంగా పరిష్కరిస్తున్నాము అంటూ అమెరికా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. అంటే కేవలం అథ్లెట్లు మాత్రమే బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు పంపిస్తారు.. ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లరు.


 అయితే అగ్రరాజ్యమైన అమెరికా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో లేదో వెంటనే మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి బాటలోనే నడిచాడు. జపాన్ కెనేడా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా చైనా లో జరిగే వింటర్ ఒలంపిక్స్ ని తాము దౌత్యపరంగా బహిష్కరిస్తున్నామని అంటూ ప్రకటించి చైనాకు షాక్ ఇచ్చాయి. ఇక ఇలా వరుసగా దేశాలు దౌత్యపరంగా బీజింగ్ ఒలింపిక్స్ను బహిష్కరించడం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే అటు భారత ప్రభుత్వం మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.


 చైనా లో జరిగే వింటర్ ఒలంపిక్స్ నపై తాము నిషేధం విధించడం లేదు అంటూ తెలిపింది భారత ప్రభుత్వం. అదేంటి చైనాపై అన్ని రకాల నిషేధం విధించిన భారత్ ఇక ఇప్పుడు బీజింగ్ ఒలింపిక్స్ పై నిషేధం వివరించక పోవడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంది. బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొనడానికి భారత్ నుంచి కాశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ అనే ఒకే ఒక అథ్లెట్ను పంపిస్తుంది భారత ప్రభుత్వం. ఇలా అధికారికంగా బహిష్కరించకుండా ఒకే ఒక అథ్లెట్ను పంపిస్తున్నా భారత్.. ఇక మిగతా అథ్లెట్ లను పంపించకుండా ఇండైరెక్టుగా బహిష్కరించినట్లు గానే వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: