క‌రోనా ఉద్ధృతి నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రికీ త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ విన్న‌విస్తూనే, తెలుగు దేశం అధిప‌తి చంద్ర‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంక్షిస్తూ సోష‌ల్ మీడియాలో త‌న సందేశాన్ని పోస్టు చేశారు..

ఆందోళ‌న‌క‌రంగా ఉన్నా
............ప‌ట్టించుకోరేం...

భౌతిక దూరం పాటించండి..వీలున్నంత వ‌ర‌కూ చేతులు శుభ్రం చేసుకోండి.. మాస్క్ వాడ‌కం త‌ప్ప‌ని స‌రి అని అంటూ ప్ర‌తిరోజూ వినిపించే ఆరోగ్య సూత్రాల‌ను మ‌నం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిరూప‌ణ అయిపోయింది. కొన్నిసార్లు నిర్ల‌క్ష్యం కార‌ణంగానే వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉంద‌న్న విష‌యాన్ని కూడా ఎవ్వ‌రూ గుర్తించ‌డం లేదు.అదేవిధంగా ప్ర‌భుత్వాలు ఎన్ని నియంత్ర‌ణ చ‌ర్య‌లు తీసుకున్నా పౌరుల బాధ్య‌తారాహిత్యం కార‌ణంగా కేసుల సంఖ్య గ‌ణనీయంగా పెరిగి, మ‌ళ్లీ లాక్డౌన్ దిశ‌గా దేశం వెళ్లేందుకు ఇప్ప‌టి సంక్షిష్ట ప‌రిణామాలు దోహదం కానున్నాయి. అయినా కూడా మాకేంటి అన్న ధోర‌ణి? వీడితే కోవిడ్ మ‌హ‌మ్మారి నుంచి ఎవ్వ‌రైనా

బ‌య‌టప‌డ‌వ‌చ్చు.ఆందోళ‌న లేని జీవితాల‌కు ఆనందం ఆలంబ‌న కావొచ్చు.క‌నుక స్టే సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్.. ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్ కూడా ప్ర‌జ‌ల‌కు కరోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు. వివ‌రాల్లోకి వెళ్తే...

మొబైల్ ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌రోనా పాజిటివ్ అని తేలింది.స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్నార‌ని వైద్య వ‌ర్గాలు సైతం ధ్రువీక‌రిస్తున్నాయి.ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధ్య‌క్షులు స్పందించారు. చంద్ర‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.కోలుకున్నాక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మునుప‌టి ఉత్సాహంతో ప‌నిచేయాల‌ని పేర్కొంటూ సోష‌ల్ మీడియాలో త‌న అభిప్రాయాల‌ను పోస్టు చేశారు.తెలుగు రాష్ట్రాల‌లో కేసులు తీవ్ర‌త‌పై ఆందోళన చెందుతూ, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారానే క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గలం అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుతూ వీలున్నంత మేర మొబైల్ ప‌రీక్షా కేంద్రాలు నిర్వ‌హించ‌డం ఉత్త‌మం అని సూచించారు.

బ‌డులు మూసెయ్యాలి...
త‌ర‌గ‌తులు వాయిదా వేయాలి....

ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌రోనా నియంత్ర‌ణ‌కు చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్న‌ప్ప‌టికీ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ విష‌య‌మై మ‌రోసారి పున‌రాలోచ‌న చేయాలి అని కోరారు.తరగతుల నిర్వ‌హ‌ణ విష‌య‌మై ఇప్పుడున్న ప‌ద్ధ‌తి ఏమంత ఆమోద యోగ్యం కాద‌ని, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌నే వాయిదా వేసుకోవాల‌ని తాను అభ్య‌ర్థిస్తున్నానని చెప్పారు.ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ పూర్తి కాక‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అయ్యే వీలుంద‌ని ఆందోళ‌న చెందారు.అదేవిధంగా మ‌ద్యం దుకాణాల నిర్వ‌హ‌ణ గడువును మ‌రో గంట‌కు పొడిగించ‌డం కూడా భావ్యం కాద‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: