కొండా సురేఖ...తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు...అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నేత. మధ్యలో రాజకీయంగా కొన్ని తడబాటులు వల్ల కాస్త వెనుకబడ్డారు. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా సక్సెస్ చూడాలనే దిశగా పనిచేస్తున్నారు. అయితే సురేఖ కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగారు. 1999, 2004 ఎన్నికల్లో శ్యాంపేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మంత్రిగా పనిచేశారు. ఇక 2009లో పరకాల నుంచి పోటీ చేసి గెలిచారు.

వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. తెలంగాణలో వైసీపీ హవా తగ్గిపోవడంతో..టీఆర్ఎస్‌లో చేరి 2014లో వరంగల్  ఈస్ట్ నుంచి గెలిచారు. కానీ 2018 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉంటూ పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


పైగా తాజాగా కొండా సురేఖ భర్త మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని ఓ టీఆర్ఎస్ కార్యకర్త ధ్వంసం చేశాడు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరిగిందని కొండా సురేఖ సైతం..ధర్మారెడ్డిపై ఫైర్ అవుతున్నారు. చల్లాకు రోజులు దగ్గర పడ్డాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఇష్యూ తర్వాత కొండా ఫ్యామిలీ మరింత యాక్టివ్ అయింది.

పరకాలలో కాంగ్రెస్ శ్రేణులు కూడా దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టాయి...ఈ సారి ఎలాగైనా చల్లాని ఓడించాలని కాంగ్రెస్ శ్రేణులు పని చేస్తున్నాయి. సురేఖ కూడా ఎక్కడా తగ్గడం లేదు...చల్లా బలాన్ని తగ్గించి, నెక్స్ట్ ఎన్నికల్లో పరకాల బరిలో నెగ్గి తన సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారు. చూడాలి ఈ సారి పరకాలలో కొండా సురేఖ పైచేయి సాధిస్తారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: