సాధారణంగా పామును చూస్తే అందరూ భయపడిపోతుంటారు ఇక వెళ్లేదారిలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే అటువైపు వెళ్లడాన్ని కూడా మానుకుంటూ ఉంటారు ఎంతోమంది. అక్కడ కనిపించేది విషసర్పం కాకపోయినప్పటికీ ఎంతోమంది భయపడిపోతుంటారు. అలాంటిది ఇక పాము చేతిలో పట్టుకోవడం అంటే అది కేవలం సినిమాలలోనే మాత్రమే సాధ్యం అవుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇక మనం ఉంటున్న పరిసరాల్లో ఎక్కడైనా పాము కనిపిస్తే భయంతో వెంటనే పాములు పట్టుకునే వాళ్లకు సమాచారం అందించడం లాంటివి చేస్తూ ఉంటామ్. ఇలా పాములు పట్టుకునే వాళ్ళు ఎంతో చాకచక్యంగా విష సర్పాలనూ పట్టుకొని వాటిని దూరంగా అడవుల్లో వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు.


 కానీ కొన్ని కొన్ని సార్లు ఇలా పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకునే వారు చివరికి అదే పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎలాగో పాములు పట్టుకోవడం తెలుసు కదా అని విష సర్పాల తో ఆటలు ఆడితే మాత్రం ప్రాణాల మీదికి వస్తుందని ఇప్పటికీ ఎన్నో ఘటనలు రుజువు చేశాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  పాములు పట్టుకుని జనాలను రక్షించే వ్యక్తి ఇప్పుడు అదే పాముకాటుకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు మహారాష్ట్రకు కు చెందిన ఆకాశ్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చి భార్యా పిల్లలతో కలిసి గాజులరామారం లో ఉంటున్నాడు.


 స్థానికంగా రాళ్లను కొడుతూ బతుకుబండిని నెట్టుకొస్తున్నాడు ఆకాష్. ఇక పాములు పట్టడం లో కూడా ఆకాశ్ దిట్ట అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవలే రాత్రి సమయంలో జనావాసాల్లోకి విషసర్పం వచ్చింది. దీంతో వచ్చి పామును పట్టుకోవాలి అంటూ ఆకాష్ కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆకాష్ ఎంతో చాకచక్యంగానే విష సర్పాన్ని పట్టుకున్నాడు. అంతటితో  ఆగకుండా కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. పామును మెడకు చుట్టుకొని ఏకంగా ఫోటోలకి  ఫోజులు ఇస్తూ లిప్ లాక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత సర్పాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత గంటకు అతడు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా పాము కాటు కారణంగానే ఇలా అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: