ఏ ముహూర్తాన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చారో అక్కడి నుంచే కొత్త కొత్త వాదాలు వినిపిస్తున్నాయి. అంతూపొంతూ లేని రీతిలో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.బీజేపీ మళ్లీ మళ్లీ కేసీఆర్ దేశభక్తిని సంకిస్తోంది.ఆయన ఈ దేశానికి మద్దతిస్తున్నారా లేదా వేరే దేశానికి ఇస్తున్నారా అంటూ మండి పడుతోంది.ఇవన్నీ ఎన్నికల వరకూ సాగనున్నాయి.ఆ తరువాత మరి ఉండవు లేండి. అందాక వీరి కొట్లాటను చూసి విని ఆనందించడం మన వంతు!
రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అసలు అక్రమాలే జరగలేదని సుప్రీం కోర్టు తేల్చినా, తమ ప్రభుత్వం పై కేసీఆర్ ఆరోపణలు చేయడం తగదని బీజేపీ బాస్ బండి సంజయ్ అంటున్నారు.ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది అని అంటున్నారీయన.తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం సీన్లోకి వచ్చారు.బీజేపీ పై ఆరోపణలు చేసి వెళ్లారు.ఇదే విధంగా కొద్ది రోజలు ఈ కథ నడవనుంది.ముచ్చింతల్ వేదికగా ఆరంభం అయిన తగాదా చిలికి చిలికి గాలి వాన కానుంది.ఇందుకు సంబంధించి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి