ఈ రోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శోకించే వార్త వింటూ నిద్ర లేచింది అని చెప్పాలి. మన ప్రియతమ నాయకుడు మరియు అంద్రప్రదేష్ ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతం రెడ్డి ఇవాళ ఉదయం గుండె పాటు కారణంగా అకాల మరణం చెందారు. ఈ వార్త రాష్ట్ర ప్రజలను ఎంతగానో బాధ పెడుతుంది అని చెప్పాలి. ఎటువంటి రాజకీయ శత్రువులు, వివాదాలు లేని జీవితం ఈయనది అని చెప్పాలి. గౌతం రెడ్డి తండ్రి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అని తెలిసిన విషయమే. మేకపాటి కుటుంబానికి నెల్లూరు రాజకీయాల్లో సుస్థిరమైన స్థానం ఉంది, అలాగే ప్రజలలో ఎన్నటికీ చెరిగిపోని అభిమానం ఉంది.

గౌతం రెడ్డి 31 డిసెంబర్ 1976 లో జన్మించారు. ఇతని తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో గౌతం రెడ్డి బాగా చదువుకున్నా రాజకీయాలలో ప్రవేశించాడు. అయితే చాలా మంది నాయకులు తండ్రి పేరును వాడుకున్నా రాజకీయాల్లో ఎదిగిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది గౌతం రెడ్డిని ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు హక్కున చేర్చుకున్నారు. 2014 లో వైసీపీ తరపున ఆత్మకూరు ఎమ్మెల్యే గా పోటీ చేసి తన సమీప టీడీపీ ప్రత్యర్థి గూటూరు మురళి కన్న బాబు పై 31,412 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యే గా అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు. అయినా ఎక్కడా కూడా సీనియర్ రాజకీయ నాయకుడి కొడుకు అనే గర్వం కానీ, పదవిపై మొహం కానీ కనిపించింది లేదు.

అలా నియోజకవర్గం ఎమ్మెల్యే గా తన బాధ్యతను సరిగా నిర్వర్తించాడు. ఇది గమనించిన ప్రజలు 2019 ఎన్నికలలో కూడా తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించారు. 2019 ఎన్నికలలో గౌతం రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి అయిన బొల్లినేని కృష్ణయ్య ను 22, 276 ఓట్లతో ఓడించి వరుసగా రెండవ సారి ఎమ్మెల్యే గా గెలుపొంది రికార్డు సాధించాడు. అయితే 2019 లో వైసీపీ రాష్ట్రంలో సంచలన విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. అలా 2014 నుండి గౌతం రెడ్డి పనితీరును గమనిస్తూ వచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గౌతం రెడ్డిని ఐటీ శాఖకు మంత్రిగా నియమించారు. ఒక మంత్రిగా రాష్ట్రానికి ఏమి చేయగలడు అనేది నిరూపించి చూపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: