అవును చంద్రబాబు రాజకీయం వేరు...చంద్రశేఖర్ రాజకీయం వేరు..అయితే ఒకప్పుడు కేసీఆర్‌కు చంద్రబాబు బాస్ కావొచ్చు గాని...ఇప్పుడు ఆయనే పెద్ద బాస్. అలాగే మాజీ బాస్‌కే రాజకీయంగా చెక్ పెట్టిన ఘనత కేసీఆర్‌ది కాబట్టి...చంద్రబాబు గతే కేసీఆర్‌కు పడుతుందని బీజేపీ నేతల మాట్లాడటం కరెక్ట్ కాదనే చెప్పొచ్చు. బాబు కూడా గతంలో ఫ్రంట్ ఫ్రంట్ అని తిరిగి...ఇప్పుడు ఆయనకు ఏ టెంటు లేకుండా పోయిందని, అలాగే ఇప్పుడు కేసీఆర్ కూడా తిరుగుతున్నారని, ఆయన కూడా రాజకీయంగా అడ్రెస్ లేకుండా పోతారనే విధంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

దేశంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ని గద్దె దించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్...ఇటీవల వరుసపెట్టి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల అధినేతలని కలుస్తున్న విషయం తెలిసిందే...అలాగే వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చి..నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు...అయితే సేమ్ ఇలాగే 2019 ఎన్నికల ముందు మోడీ సర్కార్‌పై చంద్రబాబు కూడా యుద్ధం చేశారు..బీజేపీని దెబ్బకొట్టాలని చెప్పి, బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేయడానికి చూశారు...ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో కూడా జట్టు కట్టారు...కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి...కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది..ఇటు ఏపీలో చంద్రబాబు దారుణమైన పరాజయాన్ని చవిచూసి అధికారానికి దూరమయ్యారు..అప్పటినుంచి బాబు రాజకీయంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

ఇక అలాగే కేసీఆర్ కూడా ఇబ్బంది పడతారని బీజేపీ అంటుంది...కానీ బాబు వేరు, కేసీఆర్ వేరు అని విశ్లేషకులు అంటున్నారు...కేసీఆర్ మరీ గుడ్డిగా రాజకీయం చేయరని, సమయానికి తగ్గట్టు స్ట్రాటజీలు మార్చేస్తారని, కాబట్టి ఆయన్ని తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకత పెరుగుతుంది..ఈ క్రమంలో కేసీఆర్‌ ఏమి చేయలేరని బీజేపీ లైట్ తీసుకుంటే మాత్రం చిక్కులో పడక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా చంద్రబాబు రాజకీయం వేరు..చంద్రశేఖర్ రాజకీయం వేరు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: