రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా కుట్ర మొదలైందా ? అది కూడా వైసీపీ, తెలుగుదేశంపార్టీల ఆధ్వర్యంలోనే జరుగుతున్నదా ? వినటానికి ఆశ్చర్యంగానే ఉన్నా అనుమానాలైతే పెరిగిపోతున్నాయి. దీనికి ఈమధ్యనే వైజాగ్ లో జరిగిన కాపు ప్రముఖుల సమావేశమే కారణం. కాపు ప్రముఖుల్లోని కొందరు హాజరైన సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ ఏపీ అనే వేదికను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేయటమే అనుమానాలకు కారణమైంది.





అసలు విషయంలోకి వస్తే మొదటినుండి పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ సపోర్టుగా నిలబడుతున్న మాజీమంత్రి చేగొండి హరిరామజోగయ్య మాట్లాడుతు జనసేనను తొక్కేయటానికి కుట్రలు మొదలైనట్లు ఆరోపించారు. ఇప్పటికే కాపు బలిజ తెలగల సంక్షేమం కోసం చాలాకాలంగా ఒక ఫోరం ఉన్నపుడు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని చేగొండి నిలదీశారు. ఇపుడు సమావేశమైన మేధావులు, ప్రముఖులు ఆ ఫోరంలో చేరి నాయకత్వ బాధ్యతలు తీసుకుని నడిపిస్తే సరిపోతుంది కడాని చేగొండి అడగుతున్నారు.





అలాగే కాపులకు ప్రత్యేకంగా జనసేన పార్టీ ఉన్నపుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ఫోరం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకు కష్టపడాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాజా సమావేశానికి టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు, బోండా ఉమ హాజరయ్యారు. కాంగ్రెస్ నుండి మాజీమంత్రి వట్టి వంసతకుమార్, బీజేపీ నుండి కన్నా లక్ష్మీనారాయణ వచ్చారు. వైసీపీ నుండి మంత్రి బొత్సా సత్యనారాయణ జూమ్ ద్వారా పార్టిసిపేట్ చేశారు.





వీళ్ళు కాకుండా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. అయితే జనసేన నుండి మాత్రం ఎవరు హాజరుకాలేదు. ఇక్కడే చేగొండికి అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన పార్టీలో కూడా ఇలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. నిజంగానే సోషల్ ఇంజనీరింగ్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించాలంటే జనసేనలో చేరితే సరిపోతుందన్నది చేగొండి అభిప్రాయం. అలాకాకుండా ప్రత్యేకంగా ఒక ఫోరం అంటున్నారంటే పవన్ కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నట్లుగానే అనుమానించాలని చేగొండ చెబుతున్నారు. దాన్ని జనసేనలోని చాలామంది మద్దతు పలుకుతున్నారు. మరి వీళ్ళ అనుమానాలు నిజమేనా ?




మరింత సమాచారం తెలుసుకోండి: