తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. మంచి మాటలతో అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు సిద్దార్థ్. తక్కువ వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిపేందుకు అహర్నిశలు కృషిచేశారు. సీఎం జగన్ ప్రేమ చూరగొని.. శాప్ చైర్మన్ అయ్యాడు. కాగా సిద్దార్థ మాట్లాడిన ఇంటర్వ్యూలు, వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. అందుకే అతని పేరు రాజకీయాల్లొ ఎక్కువ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సిద్దార్థ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో రామ్ చరణ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు బైరెడ్డి.ఇది అతను టీనేజ్‌లో ఉన్నప్పుడు చిత్రీకరించిందిగా తెలుస్తుంది. ఎప్పుడు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసే బైరెడ్డిలోని ఈ టాలెంట్ చూసి కొందరు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి