భాషల గురించి ప్రస్తావించిన బస్వరాజ్ బొమ్మై.. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్లలాంటివని గుర్తు చేశారు. అలా ఉండటమే మన సంస్కృతి అన్న బొమ్మె.. ఆర్‌ఆర్‌ఆర్ ఘన విజయం సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలన్నారు. ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలతో చరిత్ర లిఖించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశారని కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం బస్వరాజ్ బొమ్మై ఆర్ఆర్‌ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ ఎస్ రాజమౌళి సాధారణ సినిమా మేకర్ కాదని... రాజమౌళి ఒక క్రియేటర్ అని మెచ్చుకున్నారు.
అదే సమయంలో రామ్‌చరణ్, తారక్, శివరాజ్‌కుమార్‌ల స్నేహం గురించి కూడా కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మె.. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల బంధంలా రామ్‌చరణ్, తారక్, శివరాజ్‌కుమార్‌ల స్నేహం కొనసాగాలని కోరుకున్నారు. ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమాను స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్‌లకు అంకితం ఇవ్వాలని సూచించారు. కిత్తు రాణి చెనమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయ్‌లకు కూడా ఈ సినిమాను అంకింతమివ్వాలని తాను కోరుకుంటున్నానని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి