ఇటు తెలంగాణ అటు ఆంధ్ర తో పాటు దేశంలోనీ పలు రాష్ట్రాల్లో ఎండలు ప్రాభవం ఎక్కువగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) ప్రాంతాలల్లో ఏప్రిల్ నెల తొలి 15 రోజుల్లోనే భానుడు భగభగమంటాడని ఐ ఎం డి వెల్లడించింది.

దీనితో పలు ప్రాంతాల్లో ఎండలతో పాటుగా, వడగాలులు కూడా వీచే అవకాశం లేకపోలేదని ఐఎండి తెలియజేసింది. అందువల్ల రెండు  తెలుగు రాష్ట్రాలోని ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య బయటకు అడుగు పెట్టకపోవడం మంచిదని వాతావరణ శాఖ సూచిస్తుంది. అలాగే  ఏప్రిల్ నెల తొలి 15 రోజుల పాటు కచ్చితంగా ఎండలు ఎక్కువగా ఉండే  అవకాశము లేకపోలేదని తెలిపారు. దీని కారణంగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమతయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అంటే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈ నెల 15 వరకు పలు ప్రాంతాల్లో కూడా ఎండతోపాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం కూడా ఉందట. అలాగే దేశంలోనీ పలు ప్రాంతాలతో పాటు.. హిమాలయ పర్వతాల్లోనూ కూడా ఈ సారి ఉష్ణోగ్రతలు ప్రాభవం ఎక్కువగానే ఉంటుందని ఐ ఎం డి వెల్లడించింది.అయితే  ఇలాంటి సమయంలోనే అడవుల్లో కార్చిచ్చులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందట వల్ల అటవీ శాఖ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటడం మంచిదని వాతావరణ శాఖ తెలియజేశారు.

రికార్డ్ బద్దలు:ఇక ఈ సారి మార్చి నెల నుంచే  ఎక్కువగా ఉన్న ఎండలు  దశాబ్దాల రికార్డులను తిరగరాస్తున్నాయి.క్రితం 1901 తర్వాత ఇప్పుడు ఈ మార్చి నెలలోనే  అంటే సుమారుగా 122 ఏళ్ల తర్వాత మళ్ళ దేశంలో మార్చి నెలలో ఇంత అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు సరాసరి 33.1 డిగ్రీల ఎండలు నమోదయ్యాయి. ఇంతకముందు  2010లో 33.09 డిగ్రీల రికార్డు ఉష్టోగ్రత ఫస్ట్ స్థానం లో ఉండగా దీనితో అది కూడా చెరిగిపోయింది.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన:ఇంకా  ఎండలతో, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక మంచి న్యూస్ చెప్పింది. అదికర్ణాటక  నుంచి మరఠ్వాడా మీదుగా తమిళనాడు వరకు ఉన్న ద్రోణి వలన  రాష్ట్రంలో  పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అయితే రాబోవు మరో మూడు రోజులలో ఏపీ ఆంధ్ర, తెలంగాణలో ఇంకా అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: