పాపం ఎల్లోమీడియా అవస్తలు చూస్తుంటే జాలేస్తోంది. ఎలాగైనా జనాలను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి చేయని ప్రయత్నాలు లేవు. ముందేమో వివిధ సందర్భాల్లో మామూలు జనాలను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈమధ్యనే పీఆర్సీ విషయంలో ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా ఉపయోగం కనబడలేదు. ఇపుడు మంత్రివర్గం పునర్ వ్యవస్ధీకరణ విషయంలో తెగ అవస్తలు పడుతోంది.
మింగలేక..కక్కలేక అని ఒకటి, మంత్రివర్గ మంటలని..సీనియర్ల సెగలతో జగన్ కు మంటలని ఏమిటేమిటో బాటమ్ స్టోరీలు, బ్యానర్ స్టోరీలు అచ్చేస్తున్నాయి. రాజీనామాలు చేసిన మంత్రులను ఎలాగైనా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఎల్లోమీడియా. దాదాపు 15 రోజులుగా ప్రతిరోజు మంత్రులకు సానుభూతిగాను, జగన్ కు వ్యతిరేకంగాను కథనాలు అచ్చేసినా ఉపయోగం కనబడలేదు.
చివరకు మొన్నటి క్యాబినెట్ సమావేశంలోనే మంత్రులంతా రాజీనామాలు చేసిన తర్వాత వారిపై ఎల్లోమీడియాలో సింపథి మరింత పెరిగిపోయింది. రాజీనామాలు చేసిన వారిని ఎంతగా రెచ్చగొడుతున్నా ఎవరు రెచ్చివటంలేదు. దాంతో ఎల్లోమీడియాలో పట్టుదల మరింతగా పెరిగిపోతోంది. ఒకసారి చరిత్రను చూద్దాం. చంద్రబాబునాయుడు హయాంలో మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే అవకాశాలు రాలేదని, తమను మంత్రులుగా తప్పించారనే కోపంతో బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, బోండా ఉమ లాంటి నేతలు చంద్రబాబును మీడియా ముందే బండబూతులు తిట్టిన విషయం అప్పట్లో సంచలనమైంది. అప్పట్లో చంద్రబాబుపై తమ్ముళ్ళు తిరగబడితేనేమో ఎల్లోమీడియా పూర్తిగా కవర్ చేసింది.
ఆ స్ధాయిలో ఇపుడు రాజీనామాలు చేసిన వారు జగన్ పై తిరుగుబాటు చేయాలని కనీసం తిట్టాలని ఎల్లోమీడియా ఆశించింది. తాను ఎదురుచూసింది జరగకపోవటంతో చివరకు తానే రంగంలోకి దిగి రెచ్చగొడుతోంది. అయినా ఉపయోగం కనబడకపోవటంతో ఏమి చేయాలో దిక్కుతోచటంలేదు. జగన్ మీద నిజంగానే ఎవరికైనా కోపముంటే వాళ్ళే బయటపడతారు కానీ ఎల్లోమీడియా కోసమని ఎవరైనా జగన్ను తిడతారా. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా జగన్ ఇష్టం. ఎందుకంటే లాభనష్టాలు నూరుశాతం జగన్ దే కాబట్టి ఎల్లోమీడియా చేయగలిగేదేమీ లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి