ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయపడుతున్నారా ? తాజాగా స్వయంగా ఆయన చెప్పిన మాటలను విన్నతర్వాత అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ‘జనసేన రాష్ట్రబాధ్యతలు తీసుకుంటుంది’ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తేలేదు అనే తీర్మానంపై జనసేనలోనే కొందరు నేతలు పవన్ను వ్యతిరేకిస్తున్నారు.





అంటే వ్యతిరేకించే నేతలకు బాగా తెలుసు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అడ్డుకోవటం పవన్ చేతిలో లేదని. కాకపోతే ఆ విషయం పవన్ కే అర్ధం కావటంలేదు. ఇక్కడే పవన్ కు కొందరు నేతలకు మధ్య భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. పవన్ ఆలోచనంతా చంద్రబాబును సీఎం చేయటం కోసమనే విషయం కొందరు నేతలక అర్ధమైపోయింది. అందుకనే వాళ్ళు పవన్ తో విభేదిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పుడే బయటపడితే చాలా ఇబ్బందులుంటాయని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకనే పొత్తుల విషయం ఎవరు మాట్లాడద్దని ఆదేశించింది.





చంద్రబాబును సీఎం చేయటం కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు బహిరంగంగా అంగీకరించేందుకు పవన్ భయపడుతున్న విషయం తెలిసిపోతోంది. ఇపుడే ఆ విషయాన్ని ప్రకటిస్తే ఎక్కడ మొదటికే మోసం వస్తుందనే భయమే పవన్ను పొత్తు ప్రకటన చేయనీయకుండా అడ్డుకుంటోంది. అయితే పవన్ ఆలోచనలను పసిగట్టలేనంత అమాయకులు ఎవరు లేరిక్కడ. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, వామపక్షాలు, మిత్రపక్షాలు, టీడీపీ అన్నీ కూటమిగా ఏర్పడాల్సిందే.





ఇది ఎప్పటికీ జరిగేపనికాదని అందరిరికీ తెలుసు. కాబట్టి ఓట్ల చీలికను అడ్డుకునే అవకాశం పవన్ కు లేదు. కాబట్టి పవన్ చేయగలిగేదేమిటంటే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని అంటే బీజేపీ+టీడీపీ+జనసేన కూటమిగా ఏర్పడి వీలైనన్ని ఓట్లను రాబట్టుకోవటం. బీజేపీ అంగీకరించకుండా టీడీపీ మిత్రపక్షం కాలేందు. ఇక మిగిలిన ఛాన్స్ ఏమిటంటే బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తుపెట్టుకోవటం. పవన్ ఈ విషయంలోనే సానుకూలంగా ఉంటే కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ల భయానికే టీడీపీతో పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటించటానికి పవన్ భయపడుతున్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: