తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయం లో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి రూ.80 కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టమోటా ధరలు విపరీతంగా పెరగడానికి కారణం కూడా లేకపోలేదు. రోజు రోజుకు ఎండలు భారీగా పెరగడంతో ధరలు పైకి కదిలాయి.. గతంలో ఉల్లి ధరలు యమ లొల్లి చేశాయి. ఇప్పుడు టమోటా ధరలు కూడా బాగా ఇది చేస్తున్నాయి.
ఎండలు మండిపోతుండటం, పంట వాడిపోతుండటం తో టామోటాలకు భారీ డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు రైతుల దగ్గరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అటు మదనపల్లి మార్కెట్‌లోనూ టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారం రోజల కిందట టమోటా రూ.30 నుంచి 35 పలికింది..ఇప్పుడు రంజాన్ సీజన్ కావడం తో ధరలు డబల్ పలుకుతున్నాయి. టమోటాలు పెరగడంతో సాదారణ ప్రజలు కొనడం మానెస్తున్నారు.. మరి కొద్ది రోజుల్లో ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటూన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి