అమ్మఒడి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం.. వంటి కార్యక్రమాలను అమలు చేయాలనే ఐడియాలు అసలు జగన్ కి ఎలా వస్తాయనే ఆలోచన అందరిలో ఉండే ఉంటుంది. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం అంతకు మించి అనేలా ఉంది. అదే వ్యవసాయ సీజన్ ని కాస్త ముందుకు జరపడం. ఖరీప్ ని ముందస్తుగా మొదలు పెట్టడం. ప్రతి ఏటా నవంబర్ కి కాస్త అటు ఇటు.. భారీ వర్షాలు, అల్పపీడనాలు, తుపాన్ల ప్రభావంతో రైతులకు నష్టం జరుగుతోంది. దాన్ని తప్పించుకోవాలంటే సాధ్యం కాదు. కానీ జగన్ మాత్రం సీజన్ ని కాస్త ముందుకు జరపాలని నిర్ణయించారు. ముందుగానే సాగునీరు కాల్వల ద్వారా వదిలి, ముందుగానే పంట మొదలు పెడితే, అది చేతికొచ్చిన తర్వాత వానొచ్చినా, వరదొచ్చినా, తుపానొచ్చినా.. రైతులకు నష్టం ఉండదు. ఈ ప్రణాళిక అమలు ఈ ఖరీఫ్ నుంచే మొదలు కాబోతోంది.

సీజన్ ముందుగా మొదలైతే లాభం ఏంటి..?
సీజన్ ముందుగా మొదలవ్వాలంటే ముందు సాగునీరు అందించాలి. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వానికి ఆ అవకాశం ఉంది. దీంతో గోదావరి డెల్టా ఆయకట్టుకు జూన్‌ 1 నుంచి సాగునీరు అందజేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఇక పులిచింతల విషయంలో కూడా ముందస్తు ప్రణాళికలు వర్కవుట్ అవుతాయి. పులిచింతల ప్రాజెక్ట్ లో 36 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని ప్రకాశం బ్యారేజికి ముందు విడుదల చేస్తారు. ఆ తర్వాత కృష్ణా ఆయకట్టుకు జూన్‌ 10 నుంచి సాగునీరు పంపిణీ మొదలవుతుంది. అంటే పట్టిసీమ ప్రాజెక్ట్ అవసరం లేకుండానే ఈసారి ముందుగానే సాగునీరు విడుదల చేస్తారనమాట. ఇక సాగర్‌ జలాలపై ఆధారపడిన రైతులకు జులై 15నుంచి నీరు విడుదల చేస్తారు. సోమశిల ప్రాజెక్ట్ నుంచి జులై 10న నీళ్లు విడుదల చేస్తారు. సోమశిల గరిష్ట నీటిమట్టం 72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 56 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సీజన్ ముందుగా మొదలైతే.. చివర్లో వచ్చే తుపానులు, అల్ప పీడన ప్రభావంతో పడే అకాల వర్షాలనుంచి రైతులు తప్పించుకోవచ్చు. అంటే పంట నష్టాన్ని కనిష్టానికి చేరవేయొచ్చనమాట. ఖరీఫ్ ముందుగానే మొదలైతే 3 పంటలు సాగు చేసేందుకు కూడా అవకాశముంటుంది. మూడో పంటలో పంట మార్పిడికి కూడా ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ఖరీఫ్ ని కాస్త ముందుకు జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల రైతులు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: