ఏపీ సీఎం జగన్ ఇటీవల రాజ్యసీట్లకు నలుగురు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇందులో ఇద్దరు తెలంగాణ వారు ఉన్నారు. ఒకరు బీసీ జాతీయ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అయితే మరొకరు  జగన్ లాయర్‌ వేమిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. ఇలా పక్క రాష్ట్రం వాళ్లకు రాజ్యసభ సీట్లను కట్టబెట్టడంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో బీసీలే లేరా.. రాష్ట్రంలో అర్హులే లేరా అంటూ రాయలసీమ పర్యటనలో ఉన్న చంద్రబాబు నిప్పులు చెరిగారు.


అయితే.. చంద్రబాబు విమర్శలకు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు గట్టిగానే సమాధానం చెప్పారు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని, పక్క రాష్ట్రంవాళ్లకు ఇచ్చారని చంద్రబాబు ఆరోపిస్తున్నాడని.. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లు ఏం చేశారని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. చంద్రబాబు గతంలో టీజీ వెంకటేష్‌కు సీటు ఇచ్చారా.. అమ్మారా చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  ఎంత తీసుకొని టీజీ వెంకటేష్‌కు సీటు ఇచ్చాడో పక్కకు పిలిచి అడిగితే చెబుతాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయంలో సురేష్‌ప్రభు, నిర్మలా సీతారామన్‌కు ఎలా ఇచ్చారని.. ఆయన చేస్తే రైటా..? మేము చేస్తే తప్పా అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతే కాదు.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌ ఎంత మేధావులు అని సీట్లు ఇచ్చారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వాళ్లు డబ్బు సంచులు మోశారనే ఇచ్చావా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మేము బీసీ జాతీయ నాయకుడిగా గుర్తించి కృష్ణయ్యకు ఇచ్చామని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాగుపడాలని సీఎం వైయస్‌ జగన్‌ సీట్లు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపు మండుతుందా అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.


రాజ్యసభ సీట్లు అమ్ముకునే లక్షణం తమకు లేదని.. కానీ చంద్రబాబు ఏ సీట్లు అయినా అమ్మగలడు.. కొనగలడు అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో పచ్చిగా దొరికిపోయారని.. అందుకు భయపడి నీ పార్టీని బీజేపీకి కొన్నాళ్లు తాకట్టుపెట్టిన ప్రబుద్ధుడివి కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: