అయితే పార్టీ అధిష్టానం ముందే నేతలు తమ అసంతృప్తి ని వెళ్లగక్కడంతో విషయం వైరల్ గా మారింది. ఇది జరిగింది జనసేన పార్టీలోనే అందులోనూ నాగబాబు ముందే కావడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర పై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కాగా సదరు ప్రాంతాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్న నాగబాబుకు పార్టీ నేతలు తన ఎదుటనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేయడంతో ఆయన ఆశ్చర్యపోయారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు శుక్రవారం నాడు విశాఖపట్నం జిల్లా నాయకులతో మాధవధార పార్టీ కార్యాలయంలో నేతల్తో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే ఈ మీటింగ్ కి ముఖ్య నేతలు మాత్రమే హాజరు అయితే చాలని ఒక 25 మంది వరకు ప్రముఖ నేతలను పిలవాలని చెప్పారట. కార్యకర్తలను మరోసారి కలుస్తామని ప్రత్యేకంగా చెప్పమన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు వారు ఆయా నియోజకవర్గాల బాధ్యులకు పాస్‌లు అందచేయగా అయితే పలువురు నేతలు అంతకు మించి నాయకులను తీసుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారట. అయితే అంతమంది నేతలకు కార్యాలయం సరిపోదన్న కారణంతో పాస్‌లు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలని చెప్పడంతో అక్కడే అసలు గొడవ మొదలయ్యింది. మేం సీనియర్ నేతలం మమ్మల్ని ఇలా ఆపడం ఎంటి అని కొందరు, మమ్మల్ని కూడా లోనికి పంపించండి సార్ తో మాట్లాడాల్సిన ముఖ్య విషయాలు ఉన్నాయని మరికొందరు అక్కడ గట్టిగా మాట్లాడటం తో విషయం కాస్త సీరియస్ అయ్యింది.
అయితే ఎలాగోలా శుక్రవారం రోజున నాగబాబు సమావేశం ముగించుకొని వెళ్లిపోయిన తరువాత ఆ నేతలు వాగ్వాదానికి దిగారట.. పార్టీలో తమ స్థానం ఏమిటంటూ ప్రశ్నించారట. తాము సీనియర్ నేతలం అని తమకే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ఇలా పాస్ లంటూ అడ్డుకోవడం బాగోలేదని వాగ్వాదానికి దిగడమే కాకుండా, మాట్లాడుతూ, తోపులాటకు దిగడంతో గొడవ పెద్దది అయ్యింది. అనకాపల్లి జిల్లా నాయకుడు గట్టిగా అరుస్తూ పలువురిని దూషించారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో అది చూసిన కొందరు నేతలు పార్టీ అధిష్టానానికి వెంటనే చేరవేయడంతో వెంటనే అధిష్టానం నుండి వారికి ఫోన్ కాల్స్ రావడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు.
అయితే అమరావతిలో శనివారం కీలక నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అక్కడ ఈ విషయాన్ని తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అడగలనికొందరు నాయకులు డిసైడ్ అయ్యారు. అయితే అనుకున్న విధంగానే నాగబాబు సమావేశం హజరు కాగా అక్కడ జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచిన వసంత లక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణలు నాగబాబుతో మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉంది అర్ధం కావడం లేదని , అసలు ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదని పాస్ లు పెట్టి తమని అడ్డుకుని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటికి నాగబాబు గారు చెప్పడంతో వారు సర్దుకుని వెళ్లారని, అయితే ఇప్పటికీ ఈ విషయం సర్దుమనిగినా మళ్ళీ దీనిపై నియోజక వర్గంలో పంచాయతీ పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా జనసేన పార్టీలో సొంత నేతల మధ్యనే అప్పుడే వివాదాలు చెలరేగుతుండటం గమనార్హం. ఇలా గొడవలు రావడం పార్టీ అభివృద్ధికి మంచిది కాదని.. రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారట. మరి ముందు ముందు ఇలాంటి గొడవలు రాకుండా పవన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి