తొందరలోనే కేసీయార్ కు పెద్ద పరీక్ష ఎదురవుతున్నట్లే అనుమానంగా ఉంది. మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేసినా చేస్తారు. ఎందుకంటే ఆయన చాలాకాలంగా పార్టీని వదిలేసి బీజేపీలో చేరటానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు. తాను తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ఆమధ్య స్వయంగా ఎంఎల్ఏనే చెప్పారు. అయితే ఎప్పుడు చేరేది చెప్పకపోవటంతో ఇంకా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతున్నారు.





అయితే తాజాగా ఢిల్లీకి వెళ్ళి హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రప్రభుత్వంపై ఫిర్యాదులు చేయటానికి మాత్రమే తాను అమిత్ ను కలిసినట్లు ఎంఎల్ఏ పైకి చెబుతున్నారు. అయితే తాను రాజీనామాచేసి బీజేపీ తరపున పోటీచేసి గెలవాలని అనుకుంటున్నట్లు చెప్పారట. అందుకు మొదట అభ్యంతరం చెప్పిన షా చివరకు ఎంఎల్ఏ చెప్పిందానికి కన్వీన్స్ అయినట్లు సమాచారం.






రాజీనామా చేసి ఉపఎన్నికలో మళ్ళీ పోటీచేసి గెలిస్తే వ్యక్తిగతంగా తన ఇమేజితో పాటు పార్టీ ఇమేజి కూడా పెరుగుతుందని కోమటిరెడ్డి చెప్పారట. దాంతో అమిత్ షా కూడా ఏకీభవించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అందుకనే ఎంఎల్ఏగా రాజీనామా చేస్తే వెంటనే ఉపఎన్నికలు వచ్చేట్లు చర్యలు తీసుకుంటానని హోంమంత్రి కూడా హామీ ఇచ్చారట. ఇపుడు ఎంఎల్ఏ గనుక రాజీనామా చేసి ఉపఎన్నిక వస్తే సమస్య చుట్టుకునేది ముందు కేసీయార్ కే. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్గొండ జిల్లాలో గట్టిపట్టుంది.





వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళని కాదని కేసీయార్ ఏమీచేయలేరు. ఈ విషయం స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో స్పష్టంగా అర్ధమైంది. మునుగోడు ఉపఎన్నికలో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే కేసీయార్ కు పెద్ద దెబ్బనేచెప్పాలి. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఉపఎన్నికలో అధికారపార్టీ ఓడిపోయిందంటే ఏమిటర్ధం ? అసలే కేసీయార్ మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాదనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ సమయంలో ఉపఎన్నికలో ఓడిపోతే కేసీయార్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి. అందుకనే ఎంఎల్ఏ రాజీనామా చేస్తే కేసీయార్ కు పెద్ద పరీక్షనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: