తన సొంతనియోజకవర్గం కుప్పం నేతలతో చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలికాన్ఫరెన్సే ఆయన డౌన్ ఫాల్ కు ప్రత్యక్ష సాక్ష్యంగా  నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి, కచ్చితంగా ఓడగొడతామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదే పదే చెబుతుంటే మరీ ఓవర్ గా చెబుతున్నారని అనిపించింది. అయితే తాజాగా స్వయంగా చంద్రబాబు చెప్పినమాటలు విన్నతర్వాత జగన్, పెద్దిరెడ్డి చెప్పింది నిజంచేస్తారేమో అని అనిపిస్తోంది.






ఇంతకీ టెలికాన్ఫరెన్సులో నేతలతో చంద్రబాబు మాట్లాడుతు ఏమన్నారంటే టీడీపీకి కుప్పం ప్రయోగశాలట. రాష్ట్రంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా కుప్పంలో నిర్వహించటం ఆనవాయితీనట. ఇంతవరకు చెప్పి ఊరుకునుంటే బాగుండేది. కానీ తర్వాత మాట్లాడుతు సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం ఫెయిలైందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పనిచేసే నాయకులు కావాలట. కుప్పం నేతల పనితీరుచూసి భవిష్యత్తులో పదవులిస్తారట.





సరే ఇంకా చాలా విషయాలు మాట్లాడిన చంద్రబాబు పలువురు నాయకులు అందుబాటులో రాలేదుకాబట్టి వారితో ప్రత్యేకంగా మాట్లాడుతానని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీ కోటిసభ్యత్వం చేయాలని మూడునెలల క్రితం టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటికి అయ్యింది 10 లక్షలు మాత్రమే.  అంటే టార్గెట్లో 10 శాతం అవ్వటమే కష్టంగా ఉంది. అందులోను కుప్పంలో సభ్యత్వ నమోదు చాలా పూర్ గా ఉందని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఇక బాదుడే బాదుడు కార్యక్రమం సక్సెస్ కాలేదని కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే అంగీకరించారు. అంటే కుప్పంలో తీసుకున్న రెండు అంశాలు ఫెయిలైనట్లే కదా.





కష్టకాలంలో ఉన్నపుడు పనిచేసే నాయకులు పార్టీకి కావాలని ఇపుడు చెప్పటమేంటి ? 35 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకే తెలీదా పనిచేసే నేతలెవరో ? పైగా టెలికాన్ఫరెన్సులో చాలామంది నేతలు పాల్గొనలేదట. టెలికాన్ఫరెన్సనే సుత్తిని భరించలేకే పార్టిసిపేట్ చేయలేదని తెలిసిపోతోంది. సభ్యత్వ కార్యక్రమం, బాదుడే బాదుడు కార్యక్రమం రాష్ట్రంలో ఫెయిలైందని చంద్రబాబు చెప్పారు. మరిలాంటపుడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయానా ఆశ్చర్యపోవక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: