వియ్యంకుడు కమ్ బావమరది కమ్ హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఇలా చేస్తారని చంద్రబాబునాయుడు ఏమాత్రం ఊహించుండరు. అందుకనే బుధవారం మధ్యాహ్నం బాలయ్య చేసిన పనికి చంద్రబాబుకు పెద్ద షాకేకొట్టింది. ఇంతకీ బాలయ్యచేసిన పనేమిటంటే తనతండ్రి ఎన్టీయార్ పేరుతో ఉచిత ఆరోగ్య రథాన్ని రెడీచేయటమే. ప్రజలకు ఆరోగ్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వటంకోసం ఉద్దేశించిన ఉచిత ఆరోగ్య రథాన్ని బాలయ్యా ఈరోజు ప్రారంభించారు.

ఈ ఆరోగ్యరథం ప్రతిరోజు ఒక గ్రామాంలో తిరుగుతుంది. ఇందులో డాక్టర్+నర్సులు+ల్యాబ్+ టెక్నీషియన్లుంటారు. తమదగ్గరకు వచ్చే జనాలకు డాక్టర్ పరీక్షిస్తారు. అవసరమైన వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేస్తారు. ఈ ఆరోగ్యరథంలో సుమారు 200 వైద్యపరీక్షలు చేసే సౌకర్యం ఉంది. అప్పటికప్పుడు పరీక్షలు చేసి రిజల్టు కూడా చెప్పేస్తారు. ఫలితాన్నిబట్టి డాక్టర్ మందులు కూడా ఉచితంగానే ఇస్తారు. ఈ ఆరోగ్యరథం రెడీచేయటానికి బాలయ్య సొంతంగా 40 లక్షల రూపాయలవరకు ఖర్చుపెట్టారు.

బాలయ్య ప్రారంభించిన ఆరోగ్యరథం సక్రమంగా పనిచేస్తే జనాలకు మంచి జరుగుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. అంతా బాగానే ఉందికానీ రథంపై బాలయ్యతో పాటు తన తండ్రి ఎన్టీయార్ ఫొటోలు మాత్రమే ఉంది. ఎక్కడా చంద్రబాబు ఫొటో కానీ కనీసం అల్లుడు నారా లోకేష్ ఫొటో కూడా కనబడలేదు. తెలుగుదేశంపార్టీ అని కూడా ఎక్కడా రాయించలేదు. ఎలాగూ రథాన్ని ప్రారంభించింది సొంత డబ్బులతోనే కాబట్టి పార్టీ బ్యానర్ లేదా బావయ్య చంద్రబాబు, అల్లుడు లోకేష్ ఫొటోలు ఎందుకు అనుకున్నారో ఏమో.

రథంపై చంద్రబాబు, లోకేష్, పార్టీ బ్యానర్ లేని విషయాన్ని స్ధానిక నేతలు బాలయ్య దగ్గర ప్రస్తావించినా తమిద్దరి తప్ప  ఇంకెవరి ఫొటోలు అవసరంలేదని స్పష్టంగా చెప్పేశారట. సరే తన డబ్బులతోనే చేసినా ఇంకెవరి భాగస్వామ్యంతోనో చేసినా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారన్నదే వాస్తవం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నపుడు పార్టీ బ్యానర్ కానీ చంద్రబాబు, లోకేష్ ఫొటోలు అవసరంలేదని ఎందుకు అనుకున్నారో అర్ధం కావటంలేదు. తమిద్దరి ఫొటోలు లేకుండానే వియ్యంకుడు ఇలాంటి రథాన్ని తయారుచేయిస్తాడని చంద్రబాబు ఊహించలేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: