ఓ రాజకీయ నేత చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.. కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలలో ఇలాంటివి కామన్ అని చెప్పాల్సిందే.అసలు ఆయన ఎం చేశారనే విషయం గురించి తెలుసుకుందాం..ఆయనొక మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ.. ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను శుభ్రం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5, 6 తరగతులు చదువుతున్న బాలికలతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారు.


ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ కావడంతో కాంగ్రెస్ సహా పలు పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ రంగంలోకి దిగారు. ఓ పాఠశాలకు వెళ్లి ఒట్టి చేతులతో మరుగుదొడ్డి క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.బాలికలు మరుగుదొడ్లను క్లీన్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌ అయిన అనంతరం రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.


పార్టీ నిర్వహిస్తున్న 'సేవా పఖ్‌వాడ' కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ ముందుగా మొక్కలు నాటారు. ఆ తర్వాత అపరిశుభ్రంగా ఉన్న స్కూల్‌ మరుగుదొడ్డిని చూసి.. ఒట్టి చేతులతో క్లీన్‌ చేశారు. అంతేగాక ఈ వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ సహా పలు పార్టీ నేతలకు కూడా దీనిని ట్యాగ్‌ చేశారు..ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒట్టి చేతులతో స్కూల్‌ టాయిలెట్‌ను క్లీన్‌ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్‌ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.మొత్తానికి ఇది రాజకీయ చర్చలకు దారి తీసింది..దీనిపై ఇక ఎన్ని విమర్శలు వస్తాయో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: