ప్రస్తుతం సైన్స్ ఎంత వేగంగా పెరుగుతుదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టెక్నాలజీ కూడా దూసుకుపోతుంది.. పెద్ద పెద్ద నగరాల్లో కారు లేదా బైకు తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే మాత్రం చాలా కష్టం..అలాంటి వారు ఉబెర్ వంటి వాటిలో క్యాబ్ ను బుక్ చేసుకొని వారి గమ్య స్థానాలకు త్వరగా చేరుకుంటున్నారు..యాప్ తో బుక్ చేసుకోవడం మనం చూసే ఉంటాము కానీ ఇలా వాట్సాప్ తో కూడా బుక్ చేసుకోవచ్చు. అని చాలామందికి తెలియదు..ఇప్పుడు కొత్తగా ఆ సేర్వీసు కూడా అందుబాటులోకి వచ్చింది..


తాజాగా ఊబర్ కంపెనీతో వాట్సాప్ టైయప్ అయ్యి ఊబర్ సేవలను మరింత సులభతరం చేసింది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ఢిల్లీ, లక్నో నగరాలలో అమలవుతోంది. ఈ ప్రాంతాలలో వాట్సాప్ ద్వారానే కేవలం ఊబర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా uber రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు..అసలు వాట్సాప్ ద్వారా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...


వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్ బుక్ చేసుకోవాలనుకుంటే.. ఉబర్ అఫీషియల్ నంబర్ +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి.. ఈ నంబర్‌ను సేవ్ చేసుకున్న తర్వాత చాట్స్‌లోకి వెళ్లి ఉబర్ చాట్‌బాట్‌తో చాట్ చేయొచ్చు. ఇదే కాకుండా.. http://wa.me/917292000002 లోకి వెళ్లి కూడా చాట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ కు Hi అని ఆ నంబర్‌కు మెసేజ్ చేయాలి. మీ పికప్ అడ్రస్, డెస్టినేషన్ పాయింట్స్‌ను అంటే క్యాబ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలి.. వంటి  పూర్థి వివరాలను తెలపాలి. మీరు పిక్‌అప్ కోసం లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయొచ.. అప్పుడు మీ రైడ్ ఫేర్ ఎంత అనే వివరాలు సహా రైడ్‌కు సంబంధించి ఇతర డీటెయిల్స్ అంటే ఎంతసేపట్లో వస్తుంది అనే వివరాలను కూడా వాట్సాప్‌లోనే చూడొచ్చు.అప్పుడు కంఫార్మ్ చేస్తే దగ్గర లోని డ్రైవర్లకు వెళుతుంది..క్షణాల్లో మీ ముందు ఉంటారు....


మరింత సమాచారం తెలుసుకోండి: