ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైండ్ బ్లాంక్ అయినట్లే ఉంది. తనపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పటానికి కూడా పవన్ కు నోరు రావటంలేదు. పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో తమను పవన్ మోసంచేశారన్న బీజేపీ నేతల ఆరోపణలపై పవన్ ఇంతవరకు నోరెత్తలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర సీటులో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ నేత మాధవే స్వయంగా పవన్ పై విరుచుకుపడ్డారు.





ఎన్నికల్లో తమకు సహకరించమని పవన్ను అడిగినా సహకరించలేదన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేయమని పిలుపిచ్చారు కానీ బీజేపీకి ఓట్లేయమని మాత్రం అడగలేదని మాధవ్ రెచ్చిపోయారు. పవన్ పై మాధవ్ ఇంకా చాలా ఆరోపణలే చేశారు. దాన్ని తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కన్ఫర్మ్ చేశారు. అవును ఎన్నికల్లో తమకు పవన్ సహకరించలేదని వీర్రాజు స్పష్టంగా చెప్పారు. ఓడిపోయిన అభ్యర్ధితో పాటు స్వయంగా పార్టీ అధ్యక్షుడు వీర్రాజు కూడా తనపై ఆరోపణలు చేస్తే పవన్ సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. జగన్ పైన ఎగిరెగిరి పడే పవన్ ఇపుడు అసలు మాట్లాడటమే లేదు. 





సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళ ఆరోపణలు నిజాలే కాబట్టి. ఎన్నికల సమయంలో పవన్ ఇచ్చిన బహిరంగ పిలుపునే ఇపుడు కమలనాదులు గుర్తుచేస్తున్నారు. దాంతో వాళ్ళ ఆరోపణలకు ఏమని సమాధానం చెప్పాలో పవన్ కు అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేయటానికి అత్యుత్సాహం చూపించే పవన్ లేదా నాదెండ్ల మనోహర్ ఇపుడు మిత్రపక్షం ఆరోపణలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.





మొత్తానికి మిత్రపక్షాల డొల్లతనాన్ని ఎంఎల్సీ ఎన్నికలు బయటపెట్టాయి. రాబోయే జనరల్ ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేస్తాయని మామూలు జనాలకే కాదు పార్టీ నేతలకు కూడా నమ్మకంలేదు. ఊరికే పైకి మాత్రం తమరెండు పార్టీలు మిత్రపక్షాలే అని రెండుపార్టీల్లోని నేతలు చెప్పుకుంటుంటారంతే. బహుశా ఇలాగే మరో ఏడాదివరకు చెప్పుకుంటూనే ఉంటారు. తర్వాత ఏదో సందర్భంలో విడిపోతారని రెండుపార్టీల్లోని నేతలు మాట్లాడుకుంటునే ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జనసేనతో బీజేపీ కలిసుండే అవకాశాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: