ఆసుపత్రి అంటే గుడితో సమానం. ఇక అందులో పని చేసే పెద్ద పెద్ద డాక్టర్ల నుంచి పనిమనుషులు దాకా అందరూ కూడా రోగులకు దేవునితో సమానం. కానీ ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిస్థితిలు ఇందుకు పూర్తిగా భిన్నం అని చెప్పాలి.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో  పెద్ద పెద్ద డాక్టర్లు, వారి కింద పని చేసే నర్సులు నుంచి చివరికి మరుగుదొడ్లు కడిగే పని మనుషుల దాకా అందరూ కూడా అవినీతికి పాల్పడి మానవత్వం లేకుండా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రోగుల పట్ల ఎప్పుడూ చిరాగ్గా ఉంటారు. రోగులను చాలా నీచంగా చూస్తున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలకు ఉదాహరణగా గుంటూరు, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రులు చెప్పుకోవచ్చు. ఈ ఆసుపత్రుల్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రోగులతో చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే రోగులకు తోడుగా వుండే వారి కుటుంబ సభ్యులతో కూడా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు.


ఇక డాక్టర్లు అయితే ఏదో పిక్నిక్ కి వచ్చినట్టు రోగులని సందర్శించి పోతారు.సరిగ్గా చికిత్స చేయరు. టైం పాస్ చేసి పోతారు.ఇక నర్సులు అయితే రోగులు, వారి కుటుంబ సభ్యులతో చాలా అమర్యాదగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ వున్నారు. వారే కాదు ఆఖరికి బాత్రూంలు, వార్డు రూంలు క్లీన్ చేసే పనిమనుషులు కూడా విసుక్కుంటూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైన ఒక రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారంటే చాలు సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు.వీళ్లనే కాదు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా లంచాలు తీసుకుంటున్నారు. గుంటూరు, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే ఇలాంటి దారుణాలు ప్రతి రోజు ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళసలు మనుషులు కాదు. రోగులని పీక్కుతూనే రాబందులు. కక్కిన కూడు కోసం కక్రుత్తి పడే కసాయివాళ్ళు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా వీళ్ళ దారుణాలని ఆపాలి.వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: